నందమూరి నటసింహం బాలకృష్ణ తన సినీ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు వందకు పైగా సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో బాలయ్యలా డైలాగ్ డెలివరీ ఎవరు చేయలేరు. బాలయ్య తన కెరీర్ లో చాలామంది బాలీవుడ్ హీరోయిన్లతో కూడా జతకట్టాడు. ఇప్పటివరకు బాలీవుడ్ భామలతో కలిసి బాలయ్య నటించి హిట్కొట్టిన సినిమాలేవో ఒకసారి చూద్దాం.
బాలకృష్ణ ప్రొడ్యూసర్ గా తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలలో బాలయ్య జంటగా బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ నటించింది. తర్వాత బాలయ్య హీరోగా వచ్చిన అల్లరి పిడుగు సినిమాలో బాలకృష్ణకు జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించింది. బాలకృష్ణ హిట్ సినిమాల్లో బంగారు బుల్లోడు ఒకటి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ బాలయ్య సరసన హీరోయిన్గా నటించింది.
బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో వచ్చిన లెజెండ్ సినిమాలో బాలకృష్ణకు జోడిగా రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ నటించింది. అప్పటికే రాధిక ఆప్టే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. సోనాల్ చౌహాన్ కూడా కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. ఆ తర్వాత మరో రెండు సినిమాలు రూలర్, డిక్టేటర్ లో కూడా బాలయ్య సరసన సోనాల్ నటించింది. రాఘవేంద్రరావు పాండురంగడు సినిమాలో బాలయ్య సరసన సీనియర్ హీరోయిన్ టబు నటించింది. అప్పటికే తెలుగులో కొన్ని సినిమాలు నటించిన టబు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మారింది.
బాలయ్య హీరోగా నటించిన వీరభద్ర లో బాలీవుడ్ నటి తను శ్రీ దత్త నటించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన పరమవీరచక్ర సినిమాలో బాలయ్య జంటగా అమీషా పటేల్, నేహా ధూపియా నటించారు. వీరు కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లే. బాలకృష్ణ ,సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజుతో కలిసినటించిన సుల్తాన్ సినిమాలో బాలయ్యకు జంటగా బాలీవుడ్ హీరోయిన్ దీప్తి భట్నాగర్ నటించింది.
వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఒక్క మగాడు సినిమాలో నిషా కొఠారి, ధర్మక్షేత్రంలో దివ్యభారతి నటించారు. సీనియర్ స్టార్ హీరోయిన్ నగ్మా కూడా బాలయ్యతో అశ్వమేధం సినిమాలో నటించింది.
నరసింహనాయుడు సినిమాలో బాలీవుడ్ నటి ప్రీతి జింగానియా హీరోయిన్గా నటించింది. బాలయ్య, సీనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలయ్యకు జంటగా దీపికా, మధుమతి నటించారు. వీరు కూడా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా ఉన్నవారే.
బాలయ్య కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నటించిన భార్గవ రాముడు సినిమాలో బాలీవుడ్ నటి మందాకిని హీరోయిన్ గా నటించింది. ఇలా ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సరసన నటించి బాలయ్య హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.