ఉలగనాయకన్గా ప్రసిద్ధి చెందిన సీనియర్ హీరో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ భారతీయుడు 2. ఎప్పుడో రెండున్నర దశాబ్దాల క్రిందట కమల్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఇండియన్ ( తెలుగులో భారతీయుడు ) సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే.
ఈ సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటకీ ఇండియన్ సినిమా జనాలు భారతీయుడు గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఆ సినిమాలో కమల్ నటన ప్రేక్షకుల మదిలోకి అలా వెళ్లిపోయింది. ఈ సినిమాలో కమల్‌కు జోడీగా మనీషా కోయిరాలా, ఊర్మిళ నటించారు. ఇన్నేళ్లకు మళ్లీ ఈ సినిమాకు సీక్వెల్ వస్తుండడంతో అంచనాలు మామూలుగా లేవు.
అయితే ఇండియన్ 2 సినిమా షూటింగ్ నాలుగేళ్లుగా నడుస్తూనే వస్తోంది. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది ? ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది క్లారిటీ లేకుండా నాన్చుతూ వచ్చారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఈ ఇండియన్2 సినిమా కోసం కేవలం కమల్ అభిమానులు మాత్రమే కాదు… దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ కోలీవుడ్ బజ్ ప్రకారం ఈ ఇండియన్ 2 సినిమాను 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 11 న లేదా 26న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు తేదీలలో ఏదో ఒక తేదీ ఫిక్స్ కానుందని తెలుస్తోంది. దీనిపై ఈ వారంలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.