యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించారు. అదేవిధంగా ఆయన నటించిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. టెంపర్ సినిమా నుంచి గతేడాది వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు ఎన్టీఆర్‌కు అపజయం అన్నదే లేదు. వరుసగా ఆరు సూపర్ హిట్లు కొట్టడం అంటే ఎంత గొప్ప హీరోకు అయినా అసాధ్యం. దానినే ఎన్టీఆర్ సుసాధ్యం చేసి చూపించాడు. ఇలా ఎన్టీఆర్ కెరీర్ లో టాప్ – 3 గ్రాసర్‌గా నిలిచిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
త్రిబుల్ ఆర్:
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో విడుదలై రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్నాడు.
అరవింద సమేత వీర రాఘవ:
ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి ఎన్టీఆర్‌కు మరో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
జనతా గ్యారేజ్:
స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇలా ఈ మూడు సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో టాప్ ప్లేస్ లో నిలిచాయి.
ప్రస్తుతం ఈ గ్లోబల్ హీరో తన 30వ సినిమా దేవరను స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ భామా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే ఈ సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇలా ఎవరు ఊహించిన విధంగా ఎన్టీఆర్ తన కెరీర్ లోనే దూసుకుపోతున్నాడు.