ఓరి దేవుడో.. శ్రీలీలకు కూడా అలాంటి వింత జ‌బ్బు ఉందా… షూటింగ్‌లు కూడా క్యాన్సిలే…!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారిన బ్యూటీ శ్రీలీల.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో అడుగు పెట్టింది. తన తొలి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజకు జంటగా ధమాకా సినిమాలో నటించి తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అందరూ శ్రీలీలతో కలిసి నటించాలని తహతహలాడుతున్నారు.

Actress Sree Leela Latest Beautiful Video | Sree Leela Latest Video | News Buzz - YouTube

ఇప్పటికే శ్రీలీల‌ బాలకృష్ణ నుంచి మహేష్ బాబు వరకు అందరు హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతుంది. ఇదే సమయంలో శ్రీలీల‌ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయానికి వస్తే శ్రీలీలకు కూడా ఎవరికీ తెలియని ఓ జబ్బు ఉందనే వార్త ఎప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ వ్యాధి మరేంటో కాదు ఈమెకు తుమ్ములు కంటిన్యూగా వస్తాయట.

గతంలో కూడా శ్రీలీల ఇదే విషయాన్ని ఓపెన్ గా కూడా చెప్పింది. ఐస్ క్రీమ్ గానీ, చల్లని వాటర్ గాని, కోల్డ్ వస్తువులు ఏవైనా తీసుకుంటే చాలు.. ఈమె తుమ్ముతూనే ఉంటుందట. ఇదే విషయాన్ని ధమాకా సినిమా ప్రమోషన్ లో కూడా శ్రీలీల‌ చెప్పుకొచ్చింది. అందుకే శ్రీలీల‌ తన లైఫ్ లో ఎప్పుడూ చల్లని పదార్థాలకు దూరంగా ఉంటుందట.

Sree Leela

పొరపాటున గాని ఆ వస్తువులు తీసుకుందా..? ఆ రోజు ఆమె ఏ షూటింగ్లో ఉంటే ఆ షూటింగ్‌ క్యాన్సల్ చేయాల్సిందే అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌లో చాలా మంది స్టార్ హీరోయిన్ల‌కు ర‌క‌ర‌కాల వింత జ‌బ్బులు ఉంటూ ఉంటాయి. ఈ నేప‌థ్యంలోనే శ్రీలీల‌కు తుమ్మ‌ల జ‌బ్బు ఉంద‌నుకోవాలి.