ధర్మాన ప్రసాదరావు అంటే ఏపీ రాజకీయాల్లో తెలియని వారు లేరు. ఎన్నో ఏళ్ల నుంచి ఆయన రాజకీయాల్లో ఉంటున్నారు. కాంగ్రెస్ లో ఎక్కువ కాలం పనిచేసి ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వచ్చారు. ఇక గత ఎన్నికల్లో గెలిచి…మంత్రిగా పనిచేస్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటున్న ధర్మాన..వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని తాజాగా కామెంట్స్ చేశారు.
నెక్స్ట్ ఎన్నికల్లో బరిలో ఉంటానో లేదో అని అంటున్నారు. అంటే నెక్స్ట్ తన వారసుడుని రంగంలోకి దించడానికి ధర్మాన సైడ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన వారసుడు రామ్ మనోహర్ నాయుడు..రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఇక నెక్స్ట్ ధర్మాన బదులు రామ్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ సారి శ్రీకాకుళం అసెంబ్లీలో ధర్మాన పోటీ చేసినా, ఆయన వారసుడు పోటీ చేసినా గెలవడం ఈజీ కాదనే చెప్పాలి.
ప్రస్తుతం అక్కడ ధర్మాన ఫ్యామిలీకి అనుకూలమైన వాతావరణం ఏమి లేదు. మంత్రిగా ఉన్నా సరే సిక్కోలులో ధర్మాన పెద్దగా అభివృద్ధి చేసింది లేదు..ఎంతసేపు పథకాలపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ పథకాలతో గెలవడం కష్టం. పైగా శ్రీకాకుళం అసెంబ్లీలో టిడిపి బలపడుతుంది. టిడిపి నుంచి గుండా లక్ష్మీ ఉన్నారు. గత ఎన్నికల్లో కేవలం 5 వేల ఓట్ల తేడాతోనే ఆమె ఓడిపోయారు. ఈ సారి పక్కాగా గెలిచి తీరాలని పనిచేస్తున్నారు.
అయితే ఈ సారి శ్రీకాకుళం అసెంబ్లీలో వైసీపీ, టీడీపీల మధ్య టఫ్ ఫైట్ జరగడం ఖాయం. ఇటీవల సర్వేల్లో అక్కడ టిడిపి ఎడ్జ్ లో ఉందని తేలింది. అదే సమయంలో ఇక్కడ జనసేనకు 10 వేల ఓటింగ్ వరకు ఉంది. ఒకవేళ టిడిపితో జనసేన పొత్తు ఉంటే..ఇంకా డౌట్ లేకుండా ధర్మాన వారసుడుకు చెక్ పడటం ఫిక్స్.