శర్వానంద్ ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి జరగకపోవడానికి ఇదా కార‌ణం.. అయ్యో ఇలా జ‌రిగిందేంటి…!

తెలుగు ఇండస్ట్రీ లోకి చిన్న పాత్రలతో అడుగుపెట్టి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో శర్వానంద్ ఒకరు. శర్వానంద్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబం, సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు శర్వానంద్. 2003లో ఐదో తారీకు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. శంకర్ దాదా ఎంబిబిఎస్, సంక్రాంతి, వెన్నెల, లక్ష్మీ వంటి సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లో నటించాడు. తర్వాత గమ్యం సినిమాలో హీరోగా శర్వానంద్ కి మంచి గుర్తింపు వ‌చ్చింది.

Aditi Rao Hydari and Siddharth attend Sharwanand's engagement as a couple |  Tamil Movie News - Times of India

తర్వాత ఆయన చాలా సినిమాల్లో హీరోగా నటించారు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా శతమానంభవతి, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఎక్స్ ప్రెస్ రాజా మంచి సక్సెస్ సాధించాయి. శర్వానంద్ జనవరిలో రక్షిత రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో త్వరలోనే పెళ్లి ఉంటుందని శర్వానంద్ కుటుంబ సభ్యులు తెలిపారు.

Sharwanand's engagement turns date night for Ram Charan-Upasana,  Aditi-Siddharth - Hindustan Times

ఇప్పటివరకు దానిపై స్పందించకపోవడంతో చాలామంది శర్వానంద్ అసలు పెళ్లి చేసుకుంటాడా..? లేదా..? అస‌లు పెళ్లి ఎప్పుడు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శర్వానంద్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి ఒక కారణం ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. శ‌ర్వానంద్‌కు కాబోయే ర‌క్షిత రెడ్డి యూఎస్‌లో ఉంటోంది. ఆమె చ‌దువు నిమిత్తం కొద్ది రోజులు అక్క‌డే ఉండాల్సి ఉంద‌ట‌.

Sharwanand Engagement: साउथ के फेमस एक्टर ने की सगाई, नागार्जुन-राम चरण तक,  इन्होंने की शिरकत; देखिए Photos - south actor sharwanand gets engaged with  rashita see here adorable pics where ram charan seen with pregnant wife –  News18 हिंदी

ఆమె ఇండియాకు తిరిగి వ‌చ్చే వ‌ర‌కు మ‌నోడు పెళ్లి జ‌రిగే ప‌రిస్థితి లేదు. ఇక పెళ్లి కోస‌మే డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సైన్ చేసిన సినిమాకు కూడా బ్రేక్ ఇచ్చాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి కోస‌మే కొన్ని సినిమాల‌కు కూడా సైన్ చేసి మ‌రీ వ‌దులుకున్నాడు. ఇప్పుడు పెళ్లి లేట్ అయ్యే అవ‌కాశాలు ఉండ‌డంతో శ‌ర్వానంద్ సినిమాల ప‌రంగా కూడా క‌న్‌ఫ్యూజ్ త‌ప్ప‌ట్లేదు.