హానీరోజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న అమ్మాయే. గతంలో చిన్నా చితకా సినిమాలు చేసినా ఆమెకు రాని గుర్తింపు ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో వచ్చేసింది. వీరసింహారెడ్డి సినిమాలో తండ్రి బాలయ్యకు జోడీగా నటించిన హానీరోజ్ పాత్రకు మంచి గుర్తింపే వచ్చింది. వీరసింహారెడ్డి సినిమాతో ఆమె బాగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ఆమె నిత్యం సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేస్తోంది.
అసలు ఆమె చేసే హాట్ ఫొటో షూట్లు చూస్తుంటే అవకాశాల కోసం తాను ఎందాకైనా వెళ్లేందుకు.. ఏమైనా చూపించేందుకు రెడీ అని సంకేతాలు ఇస్తున్నట్టుగానే ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా హానీరోజ్ పేరు మారుమోగుతోంది. వీరసింహారెడ్డి రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా ఆమె ఫేమ్‌లోకి రావడంతో పాటు సోషల్ మీడియా బ్లాగ్స్‌లో బాగా నానుతోంది.
హానీరోజ్ 2005లోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు ఆమె వయస్సు కేవలం 14 ఏళ్లు. ఇప్పుడు హానీ వయస్సు 31 ఏళ్లు. 60 ఏళ్ల బాలయ్యకు జోడీగా ఆమె ఆ రోల్లో బాగా సెట్ అయ్యింది. ఏదేమైనా హానీరోజ్ ఇప్పుడు టాలీవుడ్‌లో సరైన ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. అవసరం అయితే ఆమె సీనియర్ హీరోల పక్కన లేదా… మిడిల్ రేంజ్ హీరోల పక్కన కూడా ఏ ఛాన్స్ వచ్చినా చేసేందుకు రెడీగా ఉంది.