ఇప్పుడు ఎన్నిక‌లొస్తే న‌ర్సీప‌ట్నంలో ‘ అయ్య‌న్న ‘ గెలుస్తాడా… లేదా.. షాకింగ్ స‌ర్వే ఇది..!

ఏపీలో సాధారణ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. ఇప్పటినుంచే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోను ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు అందరూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలపై తీవ్ర‌ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సర్వే సంస్థలు కూడా ఏఏ నియోజకవర్గాలలో ఎవరెవరు ? గెలుస్తారు.. ఎవరెవరికి ఏ మైన‌స్‌లు ఉన్నాయి.. ఏ పార్టీ బలం ఎంత ? ఏ పార్టీ లోపాలు ఏంటి ? అన్నదానిపై రకరకాల సర్వేలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం అసెంబ్లీ సీటుపై ఇప్ప‌టికే కొన్ని స‌ర్వేలు జ‌రిగాయి.

Email Address of @umasankaraganeshpetla Instagram Influencer Profile -  Contact umasankaraganeshpetla

విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం నర్సీపట్నంలో టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2.13 లక్షల ఓటర్లు ఉన్నారు. టిడిపి పరిశీలనలో 17 వేలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నట్టు స్పష్టంగా తేలింది. అయినా కూడా ప్రస్తుత సర్వే ప్రకారం అయ్య‌న్న పాత్రుడు 10,000 ఓట్ల ఆధిక్య‌త్యతో ఉన్నారు.

గత ఎన్నికలలో అయ్యన్నపాత్రుడు పై ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఘనవిజయం సాధించారు. ఇక 2014 ఎన్నికలలో ఉమాశంకర్ గణేష్ పై అయిన పాత్రుడు 2000 ఓట్ల స్వ‌ల్ప‌ తేడాతో విజయం సాధించారు. పార్టీ ఓడిపోయినా అయ్యన్నపాత్రుడుతో పాటు ఆయన తనయుడు చింతకాయల విజయ్ రాష్ట్రస్థాయిలో అద్భుతమైన పోరాటం చేశారు. వైసిపి ప్రభుత్వంపై రకరకాల కోణాల్లో పోరాటం చేసి అయ్య‌న్న‌తో పాటు ఆయన తనయుడు విజయ్ ఇద్దరు కూడా ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు.

Life threat to senior TDP leader Chintakayala Ayyanna Patrudu - The Leo  News | English News

 

ఆయనకు కేవలం నర్సీపట్నం నియోజకవర్గంలో మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నాలుగేళ్లలో తిరుగులేని క్రేజ్‌ నెలకొంది. అయ్య‌న్న చేసిన పోరాటం ఎక్కడెక్కడో ఉన్న టిడిపి సాధారణ కార్యకర్తల్లో కూడా మంచి ఉత్సాహం నింపింది. ఇక మునిసిపల్ ఎన్నికలలోను అయ్యన్న తన భార్యతో పాటు తన కుమారుడు ఇద్దరిని పోటీ పెట్టి మరి గెలిపించుకున్నారు.

ప్రస్తుతం నియోజకవర్గంలో సమీకరణలు, రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఈ క్రమంలోనే అయ్యన్న స్పష్టమైన ఆధిక్యంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా 17 వేల బోగోస్ ఓట్లు ఉన్నా కూడా అయ్యన్న పదివేల ఓట్ల మెజార్టీతో ఉన్నారంటే.. ఎన్నికల సమయానికి ఇది మరింత పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.

Tags: AP, ap politics, ayanna pathrudu, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp