జ‌గ‌న్ ఆయువుప‌ట్టులో వైసీపీకి భారీ దెబ్బ… టీడీపీకి బిగ్ అడ్వాంటేజ్‌…!

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మొదట నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. ఏదో కొంతమేర మాత్రమే టి‌డి‌పికి సపోర్ట్ గా ఉండేవారు. అయితే రాష్ట్ర విభజన జరిగాక…కాంగ్రెస్ పరిస్తితి ఏమైందో తెలిసిందే. దీంతో వైసీపీ హవా పెరిగింది.. వైసీపీకి ఎస్సీ, ఎస్టీ వర్గాల మద్ధతు పెరిగింది. గత రెండు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో వైసీపీ హవా నడిచింది. గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వైసీపీ హవా నడుస్తుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గాలు జ‌గ‌న్‌కు ఆయువు ప‌ట్టుగా నిలిచాయి.

29 ఎస్సీ స్థానాల్లో 27 సీట్లు వైసీపీ గెలిచింది..ఇక 7 ఎస్టీ స్థానాలని వైసీపీనే గెలుచుకుంది. టి‌డి‌పి కేవలం ఒక ఎస్సీ స్థానం కొండపిలో గెలిచింది. అటు జనసేన రాజోలులో గెలిచింది. అంటే వైసీపీ హవా ఏ స్థాయిలో ఉందో..ఎస్సీ, ఎస్టీల మద్ధతు ఏ విధంగా ఉందో అర్ధమవుతుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు ఏమైనా న్యాయం జరిగిందా అంటే ప్రత్యేకమైన న్యాయం ఏమి జరగలేదు.

అందరికీ వచ్చినట్లే పథకాలు వస్తున్నాయి. ప్రత్యేకంగా కార్పొరేషన్ల ద్వారా సాయం అందడం లేదు. అటు దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి..గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యం. దీంతో ఎస్సీ ఓటర్ల లో కూడా మార్పు వస్తుంది. కొన్ని స్థానాల్లో వైసీపీకి వ్యతిరేక పరిస్తితులు ఉన్నాయి. దీంతో ఈ సారి కొన్ని సీట్లలో వైసీపీకి టి‌డి‌పి చెక్ పెట్టేలా ఉంది.

రాజాం, పార్వతీపురం, పాయకరావుపేట, అమలాపురం, రాజోలు, పి. గన్నవరం, కొవ్వూరు, గోపాలాపురం, నందిగామ, వేమూరు, ప్రత్తిపాడు, సంతనూతలపాడు, కొండపి, గూడూరు, కోడుమూరు, శింగనమల, సత్యవేడు లాంటి స్థానాల్లో వైసీపీ ఓటమి దిశగా వెళుతుంది. టి‌డి‌పి, జనసేన కలిస్తే ఈ స్థానాలని సులువుగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ సారి ఎస్సీ స్థానాల్లో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp