చిత్ర పరిశ్రమలో ఒక హీరో పేరు చెప్పుకొని ఆ కుటుంబం నుంచి హీరోలుగా, హీరోయిన్లుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టడం సర్వసాధారణం. అదే సమయంలో చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా తన తండ్రి దూసుకుపోతున్న ఆ స్టార్ హీరో కూతుర్లు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా అడుగు పెట్టలేదు. అయితే ఆ స్టార్ హీరో కూతుర్లు ఇండస్ట్రీకి రాకపోవటం మంచిది అని అభిమానులు అంటున్నారు. ఇప్పటికే ఆ స్టార్ హీరో ఎవరు అందరికీ తెలిసిపోయి ఉంటుంది. మరి ఆ హీరో మరెవరో కాదు నటసింహం నందమూరి బాలకృష్ణ.
నటరత్న ఎన్టీఆర్ కొడుకుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ తన తండ్రికి తగ్గ నటుడిగా అనిపించుకుని ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో నటసింహంగా ఎదిగాడు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే మకుటంలోని మహారాజుగా దూసుకుపోతున్నాడు. బాలకృష్ణకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు. బాలకృష్ణ ఎప్పుడూ తన కుటుంబాన్ని ఇండస్ట్రీకి పెద్దగా చూపించలేదు. అలాగే తన కూతుర్లని కూడా ఎంతో పద్ధతిగా సంప్రదాయంగా పెంచాడు బాలయ్య. బాలకృష్ణ పెంపకంలో పెరిగిన ఈ ఇద్దరికీ కూడా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాలని ఇంట్రెస్ట్ ఎప్పుడూ లేదు..
మొదటినుంచి బ్రాహ్మణి- తేజస్వినిలకి సినిమాలు అంటే అసలు నచ్చేది కాదట. సినిమాలలో నటించి స్టార్ స్టేటస్ ను అందుకోవాలని ఎప్పుడూ భావించేవారు కాదట. ఏదైనా సరే తమకంటూ స్పెషల్ గా గుర్తింపు తెచ్చుకోవాలని భావించే వారట. అంతేకాకుండా బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణి ఇప్పటికే అత్తవారింటి గౌరవాన్ని మరో లెవల్ కు తీసుకువెళ్ళింది. ఇప్పటికే హెరిటేజ్ గ్రూపులకు చైర్మన్‌గా ఉన్న బ్రాహ్మణి సింగిల్ హ్యాండ్ తో ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తుంది.
అంతేకాకుండా బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా అదే రీతిలో ఫ్యాషన్ డిజైనర్ గా సినిమాలకు తన నాన్నకు సంబంధించిన అని పనులు ఈమె చూసుకుంటుంది. ఇక బాలయ్య చిన్న కూతురు తేజస్విని వచ్చినప్పటి నుంచి బాలయ్య కెరీర్ కూడా మరో లెవల్‌కు వెళ్ళింది. ఇదే సమయంలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలకృష్ణ కూడా ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మొత్తానికి బాలకృష్ణ తన తన కూతుర్లని చిత్ర పరిశ్రమకు హీరోయిన్లుగా పరిచయం చేయకుండా మంచి పని చేశాడు.. ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఏ విధంగా ఉన్నారో మనకు తెలిసిందే కదా.!!