జ‌య‌సుధ రియ‌ల్ లైఫ్‌తోనే ఆ సినిమా వ‌చ్చిందా… ప్రేమ‌, పెళ్లి.. శాడిస్ట్‌…!

జ‌య‌సుధకు తెలుగులో మంచి ఆద‌ర‌ణ ఉంది. చిన్న వ‌య‌సులోనే అనుకోకుండా సినీ రంగ ప్ర‌వేశం చేసి న జ‌య‌సుధ‌.. అనేక సినిమాల్లో న‌టించి.. మంచి పేరు సంపాయించుకుంది. అయితే.. ఆమె జీవితం ఏమీ సాఫీగా సాగిపోలేద‌ని అంటారు. అన‌క ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నార‌ని చెబుతారు. తొలినాళ్ల లో త‌మిళ ద‌ర్శ‌కుడు బాల‌చంద‌ర్‌కు ఎంతో స‌న్నిహితంగా ఉండేవార‌ని అంటారు.

బాల‌చంద‌ర్ ద‌ర్శ‌కత్వంలో జ‌య‌సుధ పలు సినిమాల్లోనూ న‌టించారు. ముఖ్యంగా `ఇది క‌థ‌కాదు` సినిమా లో జ‌య‌సుధ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ఈ సినిమా క‌థ చాలా చిత్రంగా ఉంటుంది. ఇందులో హీరో శ‌ర‌త్‌బాబు (వాస్త‌వానికి విల‌న్ పాత్ర‌లు ఎక్కువ‌గా న‌టించేవారు), విల‌న్‌గా చిరంజీవి (ఈయ‌న హీరో పాత్రల కోసం ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు) న‌టించారు. సినిమా అంతా కూడా జ‌య‌సుధ చుట్టూనే తిరుగుతుంది.

అయితే.. ఈ సినిమా మొత్తం కూడా మ‌హిళా ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమానే. విడుదలై న అన్ని కేంద్రాల్లోనూ మ‌హిళా ప్రేక్షకులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈ సినిమా త‌మిళం, మ‌ల‌యాళం, తెలుగు మూడు భాష‌ల్లో వారం వారం వ్య‌వ‌ధితో విడుద‌లైంది. క‌థ‌, క‌థ‌నం అంతా చాలా ప‌క్కాగా ఉంటుం ది. తొలిసారి జ‌య‌సుధ ఈ సినిమా కోసం.. భ‌ర‌త నాట్యం నేర్చుకుని మ‌రీ అంద‌రినీ మెప్పించారు.

ఈ సినిమాలోనే మాట్లాడే బొమ్మ‌ను ప్ర‌వేశ పెట్టారు బాల‌చంద‌ర్‌. క‌మ‌ల్ హాస‌న్ కూడా క్యారెక్ట‌ర్ పాత్ర‌లో జీవించారు. అయితే.. త‌ర్వాత కాలంలో వ‌చ్చిన రివ్యూలు.. ఈ సినిమా జ‌య‌సుధ నిజ జీవితానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని రాయ‌డం విశేషం. ఈ సినిమాలో భ‌ర్త శాడిస్ట్‌గా వేధిస్తాడు. దీంతో ఆమె అత‌ని నుంచి దూరం అవుతుంది. త‌ర్వాత ఒక‌రిని ప్రేమిస్తుంది. కానీ, భ‌ర్త ఎంట్రీ ఇస్తాడు.. ఇలా క‌థ మొత్తం ఆమెకు మ‌న‌శ్శాంతి లేకుండా పోతుంది. ఇది జ‌య‌సుధ జీవితం అంటూ అప్ప‌ట్లో రాసుకొచ్చేవారు. మ‌రి నిజం ఎంతో ఎవ‌రికీ తెలియ‌దు.