వారాహి’కి లైన్ క్లియర్ అవటానికి అసలు కారణం అదే..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్ అయింది. పవన్ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. ఇక నుంచి జనసేనాని రాజకీయ యుద్ధనికి వారాహి కూడా తోడుగా వుండబోతోంది..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) వాహనానికి లైన్ క్లియర్ అయింది. పవన్ వాహనానికి (Pawan Kalyan Varahi) అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. పవన్‌ ‘వారాహి’ వాహనానికి ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను కూడా కేటాయించారు. ‘వారాహి’ రిజిస్ట్రేషన్ నెంబర్ (Varahi Registration Number) TS 13 EX 8384 అని అధికారులు పేర్కొన్నారు. ‘వారాహి’ కలర్‌ ఆలివ్ గ్రీన్‌‌ కాదని.. ఎమరాల్డ్ గ్రీన్ అని అధికారులు వివరణ ఇచ్చారు. నిబంధనల మేరకు ఉన్నందునే రిజిస్ట్రేషన్ చేశామని అధికారులు చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనంగా చెబుతున్న ‘వారాహి’ వాహనం రంగు ఆర్మీ వాహనాల రంగును పోలి ఉండటంతో ఈ వాహనం గురించి పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.

Tags: janasena, pawankalyan, varahi