Heroines : హీరోయిన్స్ ని నలిపేస్తున్నారుగా..!

సినిమా ప్రపంచం అంటేనే గ్లామర్ వరల్డ్. తెర మీద కనిపించేది అంతా నిజం కాదని తెలిసినా ఆడియెన్స్ మాత్రం హీరో, హీరోయిన్స్ (Heroines) ని స్టార్స్ గా చూస్తుంటారు. అయితే ఈ క్రేజ్ తో వారు బయట ఎక్కడ కనిపించినా సరే వాళ్లతో సెల్ఫీ దిగాలని.. వాళ్ల ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఈ తాకిడి ఎక్కువ ఉంటుంది. వాళ్లు ఏదైనా పబ్లిక్ ఈవెంట్ కి వెళ్లినా.. షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కి వెళ్లినా అక్కడ ఆడియెన్స్ అంతా ఆమెని టచ్ చేయాలని చూస్తారు.

ఈ క్రమంలో కొన్నిసార్లు హీరోయిన్స్ (Heroines) ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ఫుల్ క్రౌడ్ ఉన్న టైం లో ఎవరో ఒకరు హీరోయిన్స్ ఒంటి మీద ఎక్కడో ఒక చోట టచ్ చేస్తారు. పబ్లిక్ లో హీరోయిన్స్ ని నలిపేస్తారని మాత్రం చెప్పొచ్చు. స్టార్ హీరోయిన్స్ అందరికి ఇది ఎక్కడో ఒకచోట అనుభవం అయ్యి ఉంటుంది. హీరోయిన్ అక్కడకు వస్తుంది అని తెలిస్తే చాలు వేలకొద్ది ఫ్యాన్స్ అక్కడకు చేరుకుంటారు.

ఎంత సెక్యురిటీ.. చుట్టూ బాడీ గార్డ్స్ ఉన్నా పబ్లిక్ లోకి వెళ్లాక హీరోయిన్స్ కి ఈ ఇబ్బంది తప్పట్లేదు. అయితే కొందరు అందుకే ముదుగానే క్రౌడ్ ఏర్పడకముందే చేయాల్సిన ప్రోగ్రాం చేసి వస్తారు. కొందరు మాత్రం టైట్ సెక్యురిటీ ఉంటేనే షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి వస్తామని చెబుతుంటారు. ఇలా హీరోయిన్స్ కి పబ్లిక్ నుంచి ఓ రేంజ్ లో ఒత్తిడి ఉంటుందని చెప్పొచ్చు.

Tags: Heroines, Public Meetings, Shopping Mall Openings, Star Heroines, Tollywood