‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో ప్రపంచం నలుమూలల సమంత పాపులర్ అయింది , సమంతా ఎదో ఒక కారణం లేదా మరొక కారణంగా ఎప్పుడు వార్తల్లోకి వస్తుంది.సమంత తన భర్త, నటుడు నాగ చైతన్యతో విడిపోయిన తరువాత సమంత తన వావ్ అనిపించే చిత్రాలతో ఇంటర్నెట్‌లో తుఫాను సృష్టించింది.వాస్తవానికి, అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’లో ఆమె ‘ఊ అంటావా మామా’ సాంగ్ డాన్స్ సమంతను పూర్తి పబ్లిక్ గ్లేర్లో ఉంచింది.
నాగ చైతన్యతో విడిపోవడానికి ముందు ఆమె నివసించే అదే ఇంటిని ఆమె ఎలా వెళ్లి కొనుగోలు చేసింది అనే విషయం తాజా సంచలనంగా ఉంది.ఒక పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సీనియర్ తెలుగు నటుడు, రియల్టర్ కూడా అయిన మురళీ మోహన్, పెళ్లి చేసుకున్న తర్వాత సమంత చైతు జంటగా ఉన్న హైదరాబాద్ ఇంటిని కొనుగోలు చేయడంలో సమంత ఎలా మొండిగా ఉందో గుర్తు చేసుకున్నారు.
వివాహానంతరం నాగ చైతన్య, సమంతలు ఈ అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్నారని మురళి మోహన్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. “తర్వాత, వారు ఇండిపెండెంట్ ఇంటిని కొనుగోలు చేసారు మరియు వారి కొత్త ఇల్లు సిద్ధమైన తర్వాత దానిని అప్పగిస్తామనే షరతుతో ఈ అపార్ట్‌మెంట్‌ను అమ్మడం జరిగింది .ఇంతలో, ఈ జంట విడాకులు తీసుకున్నారు. దాని తరువాత సమంతా తన సొంత స్థలం కోసం వెతుకుతోంది.”
ఇంకా మోహన్ కొనసాగిస్తూ “ఆమె స్థలం వెతకడంలో సంతోషంగా లేక ఇంతక ముందు ఉన్న ఈ అపార్ట్‌మెంట్ తనకు బాగా సరిపోతుందని భావించింది. కానీ ఇంతలో అది మరొకరికి అమ్మారు .కానీ సమంతా అపార్ట్‌మెంట్‌పై పట్టుబట్టిం కొత్తవారిని ఎలాగోలా ఒప్పించి వారికి అధిక ధర ఇచ్చి దానిని కొనుగోలు చేసింది .ఇప్పుడు దానిలోసమంత మరియు ఆమె తల్లి ఇప్పుడు అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారని తెలిపారు.