గాడ్ ఫాదర్ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ అగ్ర దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయ్యింది. ఆగస్టు 21వ తేదీన మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

కాగా ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన హక్కులు అమెజాన్ కొన్నట్లు సమాచారం. గాడ్ ఫాదర్ థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది.

గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ మరో హీరోగా నటిస్తున్నాడు. ప్రధాన పాత్రలో యంగ్ హీరో సత్యదేవ్, నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి మాఫియా డాన్ గా, పొలిటికల్ లీడర్ గా నటిస్తున్నాడు. చిరంజీవి గత చిత్రం ఆచార్య ప్లాప్ కావడంతో గాడ్ ఫాదర్ చిత్రం పై అభిమానులు భారీగానే ఆశలు పెంచుకున్నారు.

Tags: chiranjeevi, god father, tollywood cinimas, tollywood heros