బాలీవుడ్ అగ్ర హీరోయిన్ అలియాభట్ వివాదంలో చిక్కుకుంది. ఆమెని టార్గెట్ చేసి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో యంగ్ హీరో సుశాంత్ రాజపుత్ మరణం తర్వాత నెపోటిజంపై పెద్ద చర్చ జరిగింది. బాలీవుడ్ లో తరతరాలుగా పాతుకుపోయిన సినీ నేపథ్యం ఉన్న కుటుంబాలపై ప్రేక్షకులు తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్నుంచి అగ్రహీరోలు, సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల వారి సినిమాలు విడుదల అవుతున్న సమయంలో ప్రేక్షకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇటీవల అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా విడుదల సమయంలో బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా అనే ట్యాగ్ లైన్ ని నెటిజన్స్ ట్రెండింగ్ లోకి తెచ్చారు. దీనివల్ల సినిమాకు భారీగా నష్టం జరిగింది. విడుదలకు ముందే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. దీనిపై ఆ సినిమాలో నటించిన కరీనా కపూర్ స్పందించి..ఇష్టం ఉన్నవాళ్ళు సినిమా చూడండి..లేకపోతే లేదు..అన్నట్లుగా కామెంట్ చేసింది. కరీనా చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. ఆ తర్వాత ఆమె క్షమాపణలు కోరినా ట్రోల్స్ ఆగలేదు.
ప్రస్తుతం తెలుగు హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో బాయ్ కాట్ ట్రెండ్ పై స్పందించారు. అమీర్ ఖాన్ సినిమాపై వ్యతిరేక ప్రచారం చేయడం తగదు.. అని కామెంట్స్ చేశాడు. దీంతో నెటిజన్లు దేవరకొండ పై కూడా ఫైర్ అయ్యారు. నీ సినిమాను కూడా బాయ్ కాట్ చేస్తామని బెదిరించారు. అయితే విజయ్ ఈ విషయంలో తగ్గలేదు. రండి చూసుకుందాం.. ఏదైతే అది ఎదుర్కొంటా..అంటూ.. వ్యాఖ్యలు చేశారు.
తాజాగా బాయ్ కాట్ ట్రెండ్ పై హీరోయిన్ అలియా భట్ స్పందించింది. ‘ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల్లో పుడితే.. తొలి సినిమా వరకే అది ఉపయోగపడుతుంది.అసలు ఆ కుటుంబంలోనే పుట్టడం తప్పంటే ఎలా? మీకు నేను ఇష్టం లేకపోతే నన్ను చూడొద్దు. నేను ఏమి చేయలేను.’ అని కామెంట్స్ చేసింది. అలియా భట్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్లో వైరల్ గా మారాయి. అలియా భట్ పై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. నీ భర్త రణబీర్ కపూర్ హీరోగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమాను బాయ్ కాట్ చేస్తామని ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ లో ఈ బాయ్ కాట్ ట్రెండ్ నటీనటులకు నిర్మాతలకు ఇబ్బందిగా మారింది.