“ భగవంత్ కేసరి ” టైటిల్ వెనుక ఉన్న అసలు అర్ధం తెలుసా.. రొమాలు నిక్క పొడుచుకుంటాయ్‌..!

గాడ్ ఆఫ్ మాసెస్ నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం భ‌గ‌వంత్ కేస‌రి. అఖండ‌, వీర‌సింహారెడ్డి లాంటి రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాల‌య్య ఇప్పుడు భ‌గ‌వంత్ కేస‌రి లాంటి ప‌వ‌ర్ ఫుల్ మాసీవ్ టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

టాలీవుడ్‌లోనే ఏకంగా ఆరు వ‌రుస సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌డంతో అంచ‌నాలు అయితే మామూలుగా లేవు. ఇటు బాల‌య్య దూకుడు, అటు అనిల్ వ‌రుస హిట్లు.. వీరిద్ద‌రి కాంబినేష‌న్ అంటే ఖ‌చ్చితంగా పెద్ద సెన్షేష‌న‌ల్ అవుతుంద‌ని టాలీవుడ్ సినీ జ‌నాల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాలు కూడా గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాయి.

ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా ముదురు ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్గా చేస్తోంది. వ‌ర్థ‌మాన హీరోయిన్ శ్రీలీల బాల‌య్య కూతురు పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఈ సినిమాలో బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని.. టైటిల్‌తో పాటు రివీల్ చేసిన ఫ‌స్ట్ లుక్ చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ సినిమాలో బాలయ్య పాత్ర పేరు అదే.

ఫ‌స్టాఫ్ అంతా బాల‌య్య జైలులో ఉండి క‌థ న‌డిపిస్తాడ‌ని.. ఇంట‌ర్వెల్‌కు అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంద‌ని.. ఇక సెకండాఫ్‌లో జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన బాల‌య్య ఏం చేస్తాడ‌న్న‌దే సినిమా క‌థ అంటున్నారు. సినిమా టైటిల్‌తోనే రోమాలు నిక్క‌పొడుచుకునేలా ఉంది. రేపు థియేట‌ర్ల‌లో బాల‌య్య న‌ట విశ్వ‌రూపం అయితే మామూలుగా ఉండ‌దు.