ప్రభాస్ వేసుకున్న టీ -షర్ట్ విలువ ఎంతో తెలుసా !

గత రాత్రి హైదరాబాద్‌లో జరిగిన సీతా రామం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పాన్ ఇండియా నటుడు ప్రభాస్ హాజరయ్యారు. చాలా కాలం తర్వాత తమ అభిమాన నటుడిని పబ్లిక్ ఈవెంట్‌లో చూస్తున్నందుకు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభాస్ కొత్త లుక్‌కి అందరూ ఫిదా అయ్యారు.

ప్రభాస్ చాలా సాదాసీదాగా ఉండటానికి ఇష్టపడతాడు,అంతే కాకుండా సాధారణ దుస్తులను ధరిస్తాడు. అయినప్పటికీ, ‘సీతా రామం’ ఈవెంట్‌లో ప్రభాస్ క్యాజువల్ లుక్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.వారిలో చాలామంది ప్రభాస్ ధరించిన నల్లటి టీ-షర్టును ఇష్టపడ్డారు. డోల్స్ అండ్ గబ్బన రూపొందించిన టీ-షర్టు విలువ 20000 rs .అంతే కాకుండా 2017 లో సేమ్ టీ షార్ట్ ప్రభాస్ వేసుకున్నాడని ఫ్యాన్స్ గుర్తు చేసుకున్నారు.

“సీతా రామం”లో దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ ప్రధాన జంటగా నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ పీరియాడికల్ డ్రామాలో రష్మిక మందన్న కీలక పాత్ర పోషించింది, ఇందులో తరుణ్ భాస్కర్, సుమంత్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు థియేటర్లలో విడుదల కానుంది.

Tags: Prabhas, prabhas t shirt cost, telugu news, tollywood news