చిరంజీవి- నాగబాబు చేసిన ఆ తప్పులే కూతుర్ల కాపురాలు కూల్చేశాయా…?

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాఫ్యామిలీకి ఎంతో గౌరవం ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి ముందుగా చిరంజీవి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తర్వాత చిరు సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. చిరంజీవి చిన్న సోదరుడు పవన్ కళ్యాణ్ తన అన్నను మించిన స్టార్‌డ‌మ్‌తో ఇటు సినిమాలో రాజకీయాల్లో దూసుకుపోతున్నాడు. వీరి తర్వాత చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీకి పరిచయరు ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

Naga Babu: Niharika has no link to drug bust | Telugu Cinema

ఇక వేరే కాకుండా చిరంజీవి మేనల్లుళ్లు ఐకాన్ స్టార్ బ‌న్నీ, సాయిధరమ్ తేజ్ వైష్ణవ్‌ తేజ్, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. వీరందరూ చిరంజీవి సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చినా వారి సొంత టాలెంట్ తో స్టార్ హీరోలుగా ఎదిగారు. చిరంజీవికి వ్యక్తిగతంగా కూడా ఎంతో మంచి గౌర‌వం ఉంది. చిరు తన పేరు మీద బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎందరోకో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్నాడు.

చిరంజీవి తన కుటుంబం నుంచి తన కొడుకులను మాత్రమే ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. తన కూతుర్లు మాత్రం అసలు ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం కాకున్నా కూడా వాళ్ళ ప్రవర్తన వల్ల హీరోయిన్లను మించిన పాపులారిటీ తెచ్చుకుని వారు చేసే పనులతో మెగా ఫ్యామిలీ పరువు మొత్తం పోయేలా చేస్తున్నారు. నిజానికి చిరంజీవి తన కూతుర్లని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు తన పిల్లలకు మంచి ఫ్రీడం కూడా ఇచ్చాడు.

Chiranjeevi's daughter changes Insta Id – Rumors erupt | 123telugu.com

అయినా వారు ఆ ఫ్రీడం దుర్వినియోగం చేస్తున్నారు. గతంలో చిరు చిన్న కూతురు శ్రీజ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని మీడియా ఎదుట ఎంతో రచ్చ చేసి పరువు మొత్తం గంగలో కలిపేస్తుంది. ఆ త‌ర్వాత ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చాక భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసింది. రెండో పెళ్లి చేసినా కూడా మ‌ళ్లీ పాప పుట్టాక భ‌ర్త‌కు విడాకులు ఇస్తోన్న ప‌రిస్థితి. అయినా చిరు త‌న కూతురును భ‌ర్త‌తో క‌లిపే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు లేదు. అతి గారాబమే ఇక్క‌డ క‌నిపిస్తోంది.

ఇక ఎప్పుడు తన అన్న చేసిన తప్పే తమ్ముడు నాగబాబు కూడా చేస్తున్నాడు. ఆయన కూతురు నిహారికను కూడా ఎంతో గారాబంగా పెంచాడు. నిహారిక కూడా రీసెంట్గా తన భర్తకు దూరంగా ఉంటూ విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రీసెంట్గా జ‌రిగిన తన అన్న ఎంగేజ్మెంట్ లో కూడానిహారిక భర్త చైతన్య ఎక్కడ కనిపించలేదు. ఇక్క‌డ కూడా నాగ‌బాబు నిహారిక‌కే స‌పోర్ట్ చేస్తున్న‌ట్టుగా ఉంది.

Happy daughter's day.. - Megastar Chiranjeevi | Facebook

ఇక చిరు పెద్ద కుమార్తె సుస్మిత కూడా చెన్నై అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసినా ఆమె చాలా యేళ్లుగా హైద‌రాబాద్‌లో తండ్రి ఇంట్లోనే ఉంటోంది. ఏదేమైనా మెగా బ్ర‌ద‌ర్స్ తమ కూతుర్లను బాగా గారాబంగా పెంచ‌డం వల్లే ఇలా జరిగింద‌ని… మితిమీర‌న స్వేచ్ఛ‌తో భర్తలను కూడా తమ ఆధీనంలో పెట్టుకోవాలని చూడటం.. తిరిగి భర్తలకే కండిషన్స్ పెట్టే స్థాయికి వెళ్లడంతో వీళ్ల వైవాహిక జీవితాలు స‌ర్దుబాటు కాలేక‌పోయాయ‌ని అంటున్నారు.