షుగర్ వున్నవాళ్లు కూడా ఈ ఫ్రూట్స్ హ్యాపీగా తినొచ్చు….

షుగర్ అనేది దీర్ఘకాలిక జబ్బు . రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి శరీరంలోని వివిధ అవయవాలపై దుష్ప్రభావం కలుగుతుంది.. మధుమేహానికి ఒక ముఖ్యమైన కారణం లివర్ ఇన్సులిన్ తగినంతగా ఉత్పత్తి చేయకపోవడం.సాధారణంగా పండ్లు తినడం వల్ల శరీరానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది . కానీ చాలా పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వారు ఎలాంటి పండ్లు తినవచ్చు అనే ప్రశ్న మధుమేహ వ్యాధిగ్రస్తుల మనస్సులో తలెత్తుతుంది.ఎలాంటి పండ్లు తినాలో ఇప్పుడు చూద్దాం.

ఆరేంజ్ పండ్లు..

నారింజ పండ్లను తినడం వల్ల మీ శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పోషకాహార బూస్టర్. నారింజలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ తో బాధపడేవారికి ఈ పండును ఎక్కువగా తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు.

జామ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది

జామ పండు చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది మరియు విటమిన్ సి మరియు పీచు పదార్థాము అధికంగా ఉంటుంది. ఈ పండు తింటే ఆకలి అదుపులో ఉంటుంది, ఎక్కువ సేపు ఆకలి వేయదు. జామ మానవ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.ఇది మధుమేహులకు వరం లాంటిది.

పుచ్చకాయ

పుచ్చకాయలో నీరుశాతం అధికంగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.ఇది ఆకలి బాధలను తగ్గిస్తుంది మరియు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.

ఆపిల్

రోజూ ఒక యాపిల్ తినడం మంచిది. ఎందుకంటే యాపిల్స్‌లోని పోషకాలు శరీరానికి చాలా అవసరం. కానీ, యాపిల్ చాలా తియ్యగా ఉంటుంది కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు సగం యాపిల్ మాత్రమే తినాలి.

కివి

మీరు షుగర్ తో బాధపడుతున్నారు కదా అని చక్కెరను పూర్తిగా మానివేయకూడదు. శరీరం బాగా పనిచేయడానికి కొంతమొత్తంలో చక్కెర అవసరం. కివీ పండులో శరీరానికి సరిపడా చక్కెర ఉంటుంది. ఇందులో విటమిన్ సి మరియు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ పండు తినడం వల్ల మధుమేహం తీవ్రత మరియు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

రేగు పండ్లు:

ఒక రేగు పండులో 31 కేలరీలు, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి.ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులు తినడానికి అద్భుతమైన పండు.

Tags: diabetic, health, health diet