ధోనీ భార్య సాక్షి ఆ టాలీవుడ్ స్టార్ క్రికెట‌ర్‌కు పిచ్చ ఫ్యానా.. అత‌డి కోసం ఏం చేసిందంటే..!

టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని భార్య ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ధోని భార్య సాక్షి ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మించిన తమిళ సినిమా ఎల్‌జీమ్‌ ఆగస్టు 4న రిలీజ్ రెడీ అవుతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ హీరోగా ఇవానా కథానాయకగా నటిస్తున్నారు. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో జెపిఆర్ ఫిలిమ్స్ – త్రిపుర ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి.

ఈ సినిమా ప్రమోషన్ల‌లో ధోని భార్య సాక్షి బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సాక్షి హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ధోని ఎప్పుడు సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు.. ఆయన్నుంచి వచ్చిన మరో సర్ప్రైజ్ ఇది.. క్రికెట్ అంటే అందరూ ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు.. కానీ మా వారికి అది ఒక ప్రొఫెషన్.. క్రికెట్ ఎలాగో సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ కాబట్టి.. తాము సినిమా పరిశ్రమలోకి వచ్చామని సాక్షి చెప్పారు.

తాము ఇద్దరం కలిసి చాలా సినిమాలు చూస్తామని.. తెలుగులో టాప్ హీరో అల్లు అర్జున్ సినిమాలు తాను చూస్తానని.. బన్నీకి తాను పెద్ద అభిమానిని అని సాక్షి చెప్పారు. బన్నీ నటించిన అన్ని సినిమాలు చూశానని సాక్షి చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సాక్షిపై పాజిటివ్‌గా కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు.

ఏది ఏమైనా ధోని భార్య సాక్షి బన్నీ అభిమానిని అని చెప్పడంతో బన్నీ క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి. ఇక పుష్ప సినిమాతో బన్నీ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కు వెళ్ళిపోయింది. త్వరలోనే పుష్ప‌కు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాతో బన్నీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.