టాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు రాజ్ మృతి… జీవితంలో ఎన్నో ట్విస్టులు… సీనియ‌ర్‌ ఎన్టీఆర్‌తో లింక్…!

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాజ్ నిన్న‌ అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. హైదరాబాదులోని తన స్వగృహంలో గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజ్‌ అసలు పేరు తోటకూర సోమరాజు. ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు – సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు వారిలో వెంకట సూర్యనారాయణ రాజు పెద్దవాడు కాగా.. తోటకూర సోమరాజు చిన్నవాడు.

ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత, tollwood music director raj died

1954 జులై 27న రాజ్ జన్మించారు. ఆయన స్వస్థలం రాజమండ్రి సమీపంలోని రఘుదేవపురం. అయితే చెన్నైలో స్థిరపడడంతో రాజు అక్కడే పుట్టి పెరిగాడు. చిన్నప్పటినుంచి సినిమా వాతావర‌ణంలో ముఖ్యంగా సంగీత నేపథ్యంలో పెరగడంతో రాజకీయ సంగీతంపై అవగాహన ఉండేది. చదువులో యావ‌రేజ్ విద్యార్థి అయినా రాజ్‌కు తండ్రి చిన్నతనం నుంచే సంగీతం నేర్పించారు. రాజ్‌ ఇంటర్ చదువుతున్న సమయంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి హనుమంతరావు వద్ద అసిస్టెంట్ గా పని చేశారు.

రాజ్ తో అందుకే విడిపోయా.. బ్రతిమాలినా వినలేదు.. కోటి షాకింగ్ కామెంట్స్ | koti sensational comments about music director raj details, koti, music director koti, music directors raj koti, music ...

తండ్రి మరణాంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి వద్ద అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తర్వాత సాలూరి రాజేశ్వరరావు కుమారుల్లో ఒకరైన కోటితో రాజ్‌కు మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత చక్రవర్తి దగ్గర కూడా అసిస్టెంట్గా పనిచేశారు. ఆ సమయంలోనే 1982 మార్చి 11న రాజ్ వివాహం ఉషతో జరిగింది. ఇక రాజ్ కోటి ద్వ‌యానికి తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో ఎంతో మంచి పేరు ఉంది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి.

Music Director Raj of Raj-Koti Is No More!

1994 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి హలో బ్రదర్ సినిమాకి రాజ్ కోటి ద్వయం నంది అవార్డు కూడా అందుకున్నారు. అయితే అనూహ్యంగా తన స్నేహితుడు కోటీతో విభేదాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత రేసులో రాజ్ బాగా వెనుకబడి పోయారు. కోటి మాత్రం దూసుకుపోయారు.

Music Director Raj in Raj Koti Duo Passed Away due to Heart attack | టాలీవుడ్లో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కన్నుమూతNews in Telugu

రాజ్‌ కొన్ని సినిమాలలో అతిథి పాత్రలోనూ కనిపించారు. ఇక రాజ్ తండ్రి తోటకూర వెంకటరాజు దివంగత నట సౌర్వ‌భౌమ ఎన్టీఆర్ ఇద్దరు సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో మద్రాస్ లో కలిసి ఒకే గదిలో ఉండేవారు. అలా ఎన్టీఆర్ కుటుంబంతో కూడా రాజ్‌కు అనుబంధం ఉంది.