రక్షగా నిలుస్తామని అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములు మాటివ్వాలి.. చిరు ట్వీట్..!

ఇవాళ రక్షాబంధన్ సందర్భంగా మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ లో రక్షా బంధన్ పండుగను వేడుకగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట చేరి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. చిరంజీవి చెల్లెళ్లు తమ ముగ్గురు సోదరులకు రాఖీలు కడుతుంటారు.

ఈ ఏడాది కూడా చిరంజీవి ఇంట రక్షాబంధన్ సందడి కనిపిస్తోంది. చిరంజీవి ట్విట్టర్ వేదికగా మహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రాఖీ కట్టించుకోవడమే కాదు. రక్షగా నిలుస్తామని ఈరోజు అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లకు మాటివ్వాలి. నా సోదరీమణులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక నాగ బాబు తనయ నిహారిక తన సోదరుడు వరుణ్ తేజ్ కు రాఖీ కట్టింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ట్విట్టర్ వేదికగా వరుణ్ తేజ్ పంచుకున్నారు.

అలాగే నిహారిక చరణ్ ఇంటికి వెళ్లి తన సోదరుడికి రాఖీ కట్టింది. అన్నయ్య ఆశీర్వాదం పొందింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ సినిమాను నిర్మిస్తున్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు. ఇందులో కీర్తి సురేష్ చిరంజీవికి రాఖీ కట్టింది. ఈ వీడియో ద్వారా కూడా చిరంజీవి మహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags: chiranjeevi, chiranjeevi raksha bandhan