భార్య‌తో స‌ఖ్య‌త లేదంటూ ఆ స్టార్ హీరోయిన్‌ను గోకిన స్టార్ డైరెక్ట‌ర్‌..!

బాలీవుడ్ లో లైంగిక వేధింపుల‌పై ఎంద‌రో హీరోయిన్లు, న‌టీమ‌ణులు చాలా కాలంగా ఓపెన్ అవుతూ వ‌స్తున్నారు. కాస్టింగ్ కౌ…*చ్ లో భాగంగా తాము త‌మ కెరీర్ లో ఎలాంటి ? ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌న్న విష‌యాల‌ను నిర్మొహ‌మాటంగా చెపుతూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అనుభ‌వాలను ఇప్పుడు బ‌య‌ట పెట్టింది.

తాను సినిమా ఛాన్సుల కోసం ట్రై చేస్తోన్న స‌మ‌యంలో కొంత మంది ద‌ర్శ‌కులు త‌న‌ను బాగా ఇబ్బంది పెట్టార‌ని… కొంద‌రు తాను ఇబ్బంది ప‌డేలా అస‌భ్యంగా మాట్లాడ‌డంతో పాటు ప్ర‌యివేట్ బాగాల్ని తాకాల‌ని చూసేవారు. ఈ క్ర‌మంలోనే ఓ ద‌ర్శ‌కుడు అయితే ఏకంగా మితి మీరిమాట్లాడ‌డంతో పాటు బాగా చ‌నువు తీసుకోవాల‌ని చూశాడ‌ని ఆమె చెప్పింది.

మీకు పెళ్లైంద‌ని తాను కంట్రోల్ చేసే ప్ర‌య‌త్నం కూడా చేశానని.. అందుకు ఆ ద‌ర్శ‌కుడు బ‌దులిస్తూ మాది పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి.. మా మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌ని చెప్ప‌డంతో పాటు త‌న‌ను అస‌..భ్యం… గా తాకే ప్ర‌య‌త్నం చేశాడ‌ని షెర్లిన్ తెలిపింది. వెంట‌నే త‌న‌కు ఆ సినిమాలో ఛాన్స్ వ‌ద్ద‌నుకుని అక్క‌డ నుంచి వ‌చ్చేసిన‌ట్టు కూడా తెలిపింది. ఆ డైరెక్ట‌ర్ ఓ స్టార్ డైరెక్ట‌ర్ అని చెప్పినా అత‌డి పేరు చెప్పేందుకు మాత్రం షెర్లిన్ నిరాక‌రించింది.

ఇక 2021లో త‌న‌కు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యింద‌ని… ఆ టైంలో త‌న జీవితం ఎంతో క్లిష్టంగా సాగింద‌ని.. క‌నీసం కుటుంబ స‌భ్యులు సైతం సాయం చేయ‌డానికి ముందుకు రాలేద‌ని.. తెలిసిన వారు కూడా మొఖం చాటేయ‌డంతో ధైర్యాన్ని కూడ‌దీసుకుని.. నా జీవితాన్ని సంపూర్ణంగా ముగించాల‌న్న నిర్ణ‌యంతో బ‌లంగా ముందుకు వెళ్లాన‌ని చెప్పింది. షెర్లిన్ చోప్రా తెలుగులో `ఏ పిల్మ్ బై అర‌వింద్` సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత `స‌మ్ థింగ్ స్పెష‌ల్` సినిమా చేసి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది.