భూమిక చావ్లా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో ఈమె పేరు సంచలనం. వరస విజయాలకు తోడు సంచలన పాత్రలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు కంటే ముందే హిందీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది భూమిక. జీ టీవీలో వచ్చే చిన్న ప్రోగ్రామ్ నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన తేరే నామ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చే వరకు చాలా కష్టాలు పడింది భూమిక.
మధ్యలో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొంది. తేరే నామ్ తర్వాత బాలీవుడ్ అంతా భూమిక గురించి మాట్లాడుకుంది. ఆ తర్వాత తెలుగులో కూడా తన సత్తా చూపించింది ఈ భామ. చాలా తక్కువ సమయంలోనే ఖుషీ, ఒక్కడు, సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించింది భూమిక. ఈ మూడు సినిమాల తర్వాత భూమిక కెరీర్ తెలుగులో కూడా డల్ అయిపోయింది. కానీ వరస సినిమాలు అయితే చేసింది.
2007లో భరత్ ఠాకూర్‌ను పెళ్ళి చేసుకుంది భూమిక. ఇక్కడే చిన్న కథ కూడా ఉంది. భరత్ ఠాకూర్ ఎవరో కాదు.. భూమిక టీచర్. ఆయన దగ్గరే యోగా నేర్చుకుంది ఈ భామ. అలా పెరిగిన పరిచయం ప్రేమగా మారింది. నాలుగేళ్ళ పాటు డేటింగ్ చేసిన తర్వాత భరత్‌ను పెళ్ళి చేసుకుంది భూమిక. 2014లో వీళ్లకు యశ్ అనే బాబు పుట్టాడు. మధ్యలో కొన్నిసార్లు భర్తతో విడిపోయిందినే ప్రచారం జరిగినా కూడా అలాంటిదేం లేదని ప్రతీసారి చెప్తూనే ఉంది భూమిక.
ప్రస్తుతం భర్త, బాబుతో కలిసి హాయిగా తన మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.టీచర్‌నే పెళ్లి చేసుకోవడం ఏంటని అడిగినా కూడా అందులో తప్పేముంది.. ఇద్దరి మనసులు కలిసాయి కాబట్టే ఒక్కటయ్యాం అంటూ సమాధానం చెప్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఎంసీఏ, రూలర్, సవ్యసాచి, సీటీమార్, సీతారామం తదితర చిత్రాల్లో ఈమె కీలక పాత్రల్లో మెరిసింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది బీజీగా ఉంది.