రవితేజ డైరెక్టర్ కి బిగ్ షాక్ ఇచ్చిన బండ్ల గణేష్ !

బండ్ల గణేష్ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్గా మారిన సంగతి తెలిసిందే .అయితే బండ్ల ఈ మధ్య కాలంలో సినిమాలు నిర్మించక పోయినా,కాంట్రవర్సీ కామెంటోతో ప్రజల్లో ,సోషల్ మీడియాలో ఎప్పుడు వివాదంలో ఉంటాడు.బండ్ల రీసెంట్ గా జరిగిన కొన్ని ఆడియో ఫంక్షన్లలో అతని వివాదాస్పద కామెంట్స్ మరియు నాటకీయ ప్రసంగాలు అతన్ని అన్నిటికంటే ఎక్కువ పాపులర్ చేశాయి.పరిశ్రమ వర్గాల చెబుతున్న ప్రకారం బండ్ల ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉన్నాడట . అతను ఎప్పుడూ ఉచితంగా ఏమీ చేయడు అని టాక్ .

ఇంతకీ ఏమి జరిగిందంటే రీసెంట్‌గా ఓ క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పమని ఓ దర్శకుడు అతడిని సంప్రదించాడు. దీనికి బండ్ల ఏదో కోట్ చేయడంతో మళ్లీ ఆ దర్శకుడు బండ్లకి ఫోన్ చేయలేదంట. ఆ డబ్బింగ్ ఎవరికో కాదు హీరో వేణు తొట్టెంపూడి కి .చాలా కాలం తర్వాత వేణు తొట్టెంపూడి రామారావు ఆన్ డ్యూటీలో మళ్లీ నటిస్తున్నారు. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పమని బండ్ల గణేష్‌ని దర్శకుడు శరత్ మండవ కోరాడు. ఓకే చెప్పి ప్రొడక్షన్ టీమ్ ని తనకి టచ్ కి రావాల్సిందిగా కోరాడు.

ప్రొడక్షన్ టీం అతనిని సంప్రదించగా బండ్ల రూ.5 లక్షలు రెమ్యునరేషన్ అడిగాడు. దానితో బండ్లను తిరిగి మళ్లీ పిలవలేదంట .అయిన బండ్ల వాయిస్ వేణు తొట్టెంపూడికి సూట్ అవుతుందని దర్శకుడు ఎలా భావించాడో ఎవరికీ తెలియదు.
మరోవైపు, ఈ చిత్రానికి నిజంగా అతని డబ్బింగ్ కావాలంటే రూ.5 లక్షలు పెద్ద విషయం కాదు. మరి ఎందుకు దర్శకుడు ప్లాన్ మార్చుకున్నాడో.

Tags: bandla ganesh, director sarath mandava, ramarao on duty movie, Ravi Teja, venu thottempudi