చిత్ర పరిశ్రమలో ఉండే ఒక హీరో సినిమా ప్రారంభోత్సవానికి మరొక హీరో వచ్చి శుభాకాంక్షలు చెప్పటం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు చిరంజీవి నటించిన ఒక సినిమా కోసం ఏకంగా ముగ్గురు అగ్ర హీరోలు వచ్చి శుభాకాంక్షలు చెప్పారు. చిరంజీవి సీనియర్ దర్శకుడు విజయ బాపినీడు కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక మిగిలిన సినిమాలు కూడా మంచి విజయం సాధించిన.. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్ బాస్ సినిమా మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది.
ఈ సినిమా తర్వాత మళ్లీ ఇద్దరి కాంబోలో మరో సినిమా రాలేదు. దర్శకుడు విజయ బాపనీడు మరో సినిమా కోసం ప్రయత్నించిన అది వర్కౌట్ అవ్వలేదు. చిరంజీవి- విజయ బాపినీడు కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ మూవీ ఖైదీ నెంబర్ 786 ఈ సినిమా షూటింగ్ 1987 అక్టోబర్ 25న వాహినీ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ఎవరు ఊహించిన విధంగా ముగ్గురు అగ్ర హీరోలు వచ్చారు. ఆ హీరోలు మరెవరో కాదు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఈ ముగ్గురు కలిసి ఈ సినిమాను ప్రారంభించడం మరో విశేషం.
తెలుగులో ఉన్న అగ్ర హీరోలందరితో విజయబాపినీడుకు మంచి రిలేషన్స్ ఉండటం కారణంగానే ఇది సాధ్యమైంది. చిరంజీవి -భానుప్రియ పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు కృష్ణంరాజు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, శోభన్ బాబు తొలి క్లాప్ కొట్టారు. సూపర్ స్టార్ కృష్ణ ఈ తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. ఇలా ఈ నలుగురు అగ్ర హీరోలు ఒకే ప్రేమ్‌లో నిలబడి గ్రూప్ ఫోటో దిగటం అభిమానులకు ఆనందం కలిగించిన అంశం.
ఈ సినిమా కూడా నటసింహం బాలయ్య పుట్టినరోజున 1988 జూన్ 10న ఖైదీ నెంబర్ 786 విడుదలడం మరో విశేషం. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.సినిమాకు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఉన్నట్లే ఈ చిత్రం శత దినోత్సవాన్ని ఉదయం, సాయంత్రం కూడా నిర్వహించి తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు దర్శకుడు విజయబాపినీడు.