మోక్షజ్ఞ జాతకంలో రాజకీయాలను ఏలే యోగముందా.. అక్కడ చరిత్ర సృష్టిస్తారా?

నందమూరి మోక్షజ్ఞ కొన్ని నెలల క్రితం వరకు లుక్స్ విషయంలో ఏ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కడ ఓడిపోయాడో అక్కడే గెలిచి మోక్షజ్ఞ ప్రూవ్ చేశారు. బరువు తగ్గి అద్భుతమైన లుక్ తో యంగ్ జనరేషన్ స్టార్ హీరోలకు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తున్నారు. మోక్షజ్ఞ జాతకంపై కొంతమంది ప్రముఖ జ్యోతిష్కులు నెగిటివ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

అయితే మరి కొందరు జ్యోతిష్కులు మాత్రం మోక్షజ్ఞ జాతకం అద్భుతంగా ఉందని చెబుతున్నారు. అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ సత్తా చాటే ప్రతిభ మోక్షజ్ఞకు ఉందని రాజకీయాల్లోకి మోక్షజ్ఞ ఎదుగుతాడని కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలలో ఏ విధంగా సత్తా చాటుతున్నారో మోక్షజ్ఞ కూడా అదే విధంగా సత్తా చాటుతారని ఇందుకు సంబంధించి ఏ మాత్రం సందేహం అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరి మోక్షజ్ఞ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను ఆఫర్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే మోక్షజ్ఞ మాత్రం తొలి సినిమా రిలీజైన తర్వాత మాత్రమే నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు తీసుకుంటున్నానని చెప్పారని సమాచారం అందుతోంది.

మోక్షజ్ఞ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని వేగంగా సినిమాలు చేయడం కంటే మంచి సినిమాలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. మోక్షజ్ఞ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలపై దృష్టి పెడితే మాత్రం బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మోక్షజ్ఞ రాజమౌళి కాంబో ఫిక్స్ అయితే మాత్రం మోక్షజ్ఞకు తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ కు రెండో సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిన రాజమౌళి మోక్షజ్ఞకు కూడా అదే స్థాయిలో గుర్తింపును తెచ్చిపెడతారేమో చూడాలి.