ప్రభాస్ చేసిన‌ మహేంద్ర యాడ్‌ని రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఆ కారణంతోనే నో చెప్పాడా..?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. బాలయ్య అటు వెండి తెర‌పై ఇటు బుల్లితెరపై కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అఖండ సినిమాతో మంచి ఖ్యాతిని సంపాదించిన బాలయ్య తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో ఎన్నో రికార్డులను సృష్టించాడు. ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న బాలయ్య గతంలో బుల్లితెరపై ఆహా ఓటీటీ షో హోస్ట్‌గా అదరగొట్టాడు.

ఈ క్రమంలో బాలయ్య ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన యాడ్ లో కూడా కనిపించారు. ఈ యాడ్లో బాలయ్య చాలా స్టైలిష్ గా యంగ్‌లుక్‌లో కనిపించడంతో ఈ యాడ్ బాగా క్లిక్ అయింది. గతంలో బాలయ్యకు ఎన్నో వాణిజ్య సంస్థలకు సంబంధించిన ప్రకటనలకు అవకాశాలు వచ్చిన వాటిని వదులుకున్నాడట‌. అందులో ప్రభాస్ కనిపించిన మహేంద్ర కంపెనీ వెహికల్ య‌డ్ కూడా ఒకటి. ముందుగా ఈ యాడ్లో చేయడానికి బాలకృష్ణ కి అవకాశం వచ్చిందట.

కానీ బాలయ్య సినిమాలన్నీ యాక్షన్ నేపథ్యంలో ఉండడంతో బాలయ్య విలన్లను కొడితే వెహికల్‌కి వెళ్లి గుద్దుకొని వెహికల్ తున్నాతున‌క‌లవడం, సుమోలు గాల్లో తేలడం, సింగల్ హ్యాండ్ తో మహేంద్ర జీపుని ఎత్త‌డం ఇలాంటి సన్నివేశాలు చాలా సినిమాల్లో కనిపించాయి. ఇక అలాంటి సన్నివేశాలు నటించిన బాలయ్య ఈ యాడ్ చేస్తే సెటైర్లు, ట్రోల్స్ వస్తాయని ఉద్దేశంతో ఆ వాణిజ్య ప్రకటనను రిజెక్ట్ చేశాడట.

అలాగే ఆయనకు వాణిజ్య ప్రకటనలు చేయడంపై కూడా అప్పట్లో ఆసక్తి ఉండేది కాదట. ఆ తర్వాత ప్రభాస్ ఆ యాడ్ లో నటించాడు. మహేంద్ర రెడ్ కలర్ వెహికల్ ఎడారిలో దూసుకుపోవడం.. వెంటనే దుమ్మురేప‌డం చూసాం. అయితే ఈ యాడ్ సరిగా క్లిక్ కాలేదు. కానీ ఇటీవల బాలయ్య రియల్ ఎస్టేట్ యాడ్లో నటించగా అది ఓ రేంజ్ లో క్లిక్ అయింది.