బాలయ్య వదులుకున్న మోహ‌న్‌బాబు బ్లాక్‌బ‌స్ట‌ర్‌… తెర‌వెనక స్టోరీ ఇదే..!

చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమా మారో హీరో చేయడం కామన్. అలా చేసిన కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు ప్లాప్‌ అవుతుంటాయి. హిట్ అయితే ఆ సినిమాను వదులుకున్న హీరో బాధపడాల్సి ఉంటుంది. ఒకవేళ అది ప్లాప్‌ అయితే మిస్ చేసుకున్న హీరో లక్కీ అని అంటారు. అయితే ఎప్పుడో టాలీవుడ్ లో బాలకృష్ణ కూడా సూపర్ హిట్ సినిమాను వదులుకొని ఎంతో బాధపడ్డారట. ఆ తర్వాత అదే సినిమాను మోహన్ బాబు హీరోగా నటించి సూపర్ హిట్ అందుకున్నాడు.

Nandamuri Balakrishna's real estate remark draws flak- Cinema express

బాలయ్య వదులుకున్న సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మోహన్ బాబు సినిమా ఏంటో తెలుసుకుందాం. మోహ‌న్‌బాబు వ‌రుస ప్లాపుల్లో ఉన్న‌ప్పుడు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావును తనకు ఒక సినిమా చేసి పెట్టమని కోరారు. అంతకు ముందు ప్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న చిరంజీవికి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో ఓ మెమొరబుల్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత రాఘవేంద్రరావు మోహ‌న్ బాబుతో సినిమా చేశారు అది కూడా రీమిక్‌ సినిమా.

నిజానికి అల్లుడుగారు సినిమాను బాలకృష్ణతో చేయాలని రాఘవేంద్రరావు భావించారు. మలయాళం లో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకి రీమేక్ గా అల్లుడుగారు సినిమా తెలుగులో తెరకెక్కింది. ముందుగా ఈ సినిమా కథను బాలయ్యకు చెప్పగా అయ‌న‌కు స్టోరీ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు. ఈ టైప్ కథ త‌న‌కు న‌చ్చ‌ద‌ని బాల‌య్య రిజెక్ట్ చేశారు.

Alludugaru Telugu Full Movie | Mohan Babu | Telugu Filmnagar

ఇక తర్వాత ఈ రీమేక్ రైట్స్ మోహన్ బాబు దగ్గరికి వెళ్లడంతో ఇదే స్టోరీ తో మోహన్ బాబు హీరోగా అల్లుడుగారు సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో మోహన్ బాబుకు జంటగా రమ్యకృష్ణ, శోభన నటించారు. ఇక ఈ సినిమా ఆ రోజుల్లో ప్రేక్షకులకు ఓ మంచి సెంటిమెంట్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి చూశాక బాల‌య్య మంచి ఫీల్ సినిమా మిస్ అయ్యాన‌ని ఒప్పుకున్నారు.