బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ అప్డేట్ !

1991లో స్టార్ హీరో బాలకృష్ణ మరియు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చేతులు కలిపి ఆదిత్య 369 అనే క్లాసిక్‌ని అందించారు. ఈ చిత్రం ఇప్పటికీ టాలీవుడ్ చరిత్రలో ఒక సంచలనం.

ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆహా టాక్ షోలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె స్ 2 ఎపిసోడ్౩లో బాలకృష్ణ తాను ప్రస్తుతం ఆదిత్య 369 సీక్వెల్‌లో పని చేస్తున్నానని,దానికి ఆదిత్య 999 మ్యాక్స్ అని పేరు పెట్టానని చెప్పాడు. ఈ విషయంతో ఆయనే స్క్రిప్ట్ రాస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ అయింది.

ఈ సినిమాతో తన తనయుడు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచనలో నటుడు ఉన్నట్టు గాసిప్ వినిపిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 2023లో ప్రారంభించబడుతుందని ఫిలిం నగర్లో న్యూస్ వైరల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి చేయబడతాయి అని టాక్.

Tags: Aditya369 movie sequel, balakrishna, Balakrishna unstoppable show, telugu news, tollywood news