#NBK107″ రిలీజ్ పై మరో కొత్త న్యూస్ వైరల్ ..!

దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం #nbk107 అందరకి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఆల్రెడీ మాసివ్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ పలు ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా రిలీజ్ పై ఆల్రెడీ ఓ టాక్ ఫిక్స్ అయ్యి ఉంది.

నిర్మాతలు ఈ చిత్రం ని “అఖండ” హిట్ డేట్ డిసెంబర్ 2 కే ఫిక్స్ చేసారని తెలిసింది. అయితే ఇప్పుడు మళ్ళీ సినీ వర్గాల నుంచి మరో కొత్త న్యూస్ వినిపిస్తుంది. ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇదే బ్యానర్ లో ఆల్రెడీ సంక్రాంతి రేస్ లో మెగాస్టార్ 154వ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఒక వేళ చిరంజీవి,బాలకృష్ణ సినిమాలు నిజంగా సంక్రాంతికి రిలీజ్ అయితే ఫ్యాన్స్ కి ఒకప్పుడు రోజులు మళ్లీ గుర్తు చేసుకున్నట్లే . మరి ఈ పోటీ పై అయితే మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Tags: director gopichand malineni, nadamuri balakrishna, NBK107 Movie, sruthi hasan