పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు సుమ అక్కగా నటించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ఇదే…!

తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ సుమ‌ స్టార్ హీరోయిన్లను మించిన క్రేజ్‌తో దూసుకుపోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులోనే నెంబర్ వన్ యాంకర్ గా సుమా తన సత్తా చాటుతుంది. ఎంతమంది కొత్త యాంకర్లు వస్తున్న, భారీ గ్లామర్ షోతో రెచ్చిపోతున్న, బుల్లితెరపై సుమను మాత్రం ఎవరు రీ ప్లేస్ చేయలేకపోతున్నారు. అలాగే స్టార్ హీరోల సినిమాల ఏ ఈవెంట్ల‌కు అయినా స్టార్ హీరోలు సైతం సుమనే యాంక‌ర్‌గా కోరుకుంటున్నారు.

స్టార్ హీరోల సినిమాల ప్రమోషన్స్‌లో కూడా సుమను బాగానే వాడేసుకుంటున్నారు. అలాంటి ఈ స్టార్ యాంకర్ సుమ పాన్ ఇండియా హీరో ప్రభాస్‌కు అక్కగా నటించిన విషయం చాలామందికి తెలియదు. అవును మీరు ఉంటున్నది నిజమే.. హీరోయిన్ అవుదామని చిత్ర పరిశ్రమకు వచ్చిన సుమ ఆమె కెరీర్ మొదట్లో ఎన్నో సినిమాల్లో నటించింది. అలా హీరోయిన్ గానే కాకుండా ప‌లు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది.

సుమ అస‌లు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర్వాత యాంక‌ర్ అయ్యింది. అది కూడా ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు స్టార్ రైట‌ర్‌గా వ‌క్కంతం వంశీ హీరోగా వ‌చ్చిన సినిమాలో ఆమె హీరోయిన్‌గా న‌టించింది. ఆ సినిమా స‌క్సెస్ కాలేదు. ఆ త‌ర్వాత ఆమె యాంక‌ర్‌గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌ను సంవ‌త్స‌రాలుగా ఏలుతూనే వ‌స్తోంది. ఇక సుమ ఓ సినిమాలో ప్రభాస్‌కు అక్కగా చేసింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు వర్షం.

ప్రభాస్‌కు మర్చిపోలేని విజయం ఇచ్చిన ఈ సినిమాలో సుమ ఆయనకు అక్కగా నటించింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా త్రిష నటించింది. అలాగే గోపీచంద్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా ఇప్పటికే రీ రిలీజ్ అయ్యి సెన్సేషన్ కూడా క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇటీవల సుమ ఓ ఈవెంట్ లో గుర్తుచేసుకోంది. ఇక దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.