యాంకర్ అనసూయ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు.. ఈమె జబర్దస్త్ షో ద్వారా ఎంతో ఫేమస్ అయింది. నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత క్షణం, రంగస్థలం వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయిణిగా నటించిన అనసూయ తన నటనతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
ఇలా యాంకర్ గా , క్యాక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న అనసూయ సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేసిందనే విషయం చాలామందికి తెలియదు. సినిమాల్లోకి వచ్చిన సమయంలో హీరోయిన్గా ట్రై చేసిన ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. అనసూయ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె చిన్న వయసులోనే ఇంట్లో వారిని కాదని పారిపోయి ఓ వ్యక్తితో తొమ్మిది సంవత్సరాలు లివింగ్ రిలేషన్ లో ఉంది.
చిన్నతనం నుంచి సినిమాలలో హీరోయిన్ అవ్వాలని అనుకున్న అనసూయ తన స్నేహితుల అందించిన ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాగ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది. అనసూయ సినిమాల్లో నటిస్తుందని తెలుసుకున్న ఆమె తండ్రి ఎలాగైనా ఆమె ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేయాలని భావించారు. కానీ ఈ విషయం తెలుసుకున్న అనసూయ తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పిందట.
అనసూయ ఎప్పటినుంచో శశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది.. ఈ విషయం చెప్పగానే అనసూయ తండ్రికి ఎక్కడాలేని కోపం వచ్చిందట. అంతేకాకుండా వారి కుటుంబానికి తెలిసిన ఓ వ్యక్తిని ఇచ్చి అనసూయకు తొందరగా పెళ్లి చేయాలని భావించాడట.. కానీ అనసూయ మాత్రం ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పారిపోయి శశాంక్ దగ్గరికి వెళ్లి పోయింది. అదే టైంలో శశాంక్ భరద్వాజ్ అనసూయని పెళ్లి చేసుకోకుండా ఓ చిన్న ఇంట్లో చాలా రోజులు వీరిద్దరూ కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్నారట.
ఆ తర్వాత కొన్ని రోజులకీ అనసూయ తల్లిదండ్రులను ఒప్పించి శశాంక్ భరద్వాజ్ ను పెళ్లి చేసుకుంది. చిత్ర పరిశ్రమలో ఎదగడానికి ఆమె భర్త ఎంతో సపోర్ట్ ఇచ్చినా ఆమెకు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు.. ఆ సమయంలోనే జబర్దస్త్ షోలో ఎప్పుడు అడుగుపెట్టిందో అప్పటినుంచి ఆమె రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ యాంకర్లలో అనసూయ కూడా ఒకరు. ప్రస్తుతం రీసెంట్ టైమ్స్ లో యాంకరింగ్ రంగానికి గుడ్ బై చెప్పి సినిమాల్లోనే నటిస్తుంది.. ప్రస్తుతం అనసూయ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.