NTR : ఎన్టీఆర్ తో అమిత్ షా భేటి పై రాజకీయాలు ఎందుకు..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటన గురించి ప్రపంచమంతా తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో తారక రాముడి నటన నందమూరి అభిమానులనే కాదు ప్రేక్షకులకు సైతం నచ్చేసింది. ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే అవలీలగా నటించి పాత్రకి పరిపూర్ణత తెచ్చే ఎన్.టి.ఆర్ తన నటనతో అందరిని మెప్పించాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో తారక్ నటన చూసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఫిదా అయ్యారు. అందుకే హైదరాబాద్ లో ఎన్.టి.ఆర్ తో స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు.

సినిమాలో తన నటన గురించి అమిత్ షా ప్రస్థావించడం.. ఎన్టీఆర్ (NTR) తో కలిసి భోజనం చేయడం విశేషం. అయితే అమిత్ షా ఎన్టీఆర్ ని కలవడం వెనక రాజకీయ కోణం ఉందని కొందరు అంటున్నారు. సినిమా పాలిటిక్స్ రెండిటికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ ని అమిత్ షా కలవడం వెనక కారణాలు ఏంటి అని విశ్లేషిస్తున్నారు.

2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ బలం పెంచుకునేందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్.టి.ఆర్ అంటే టీడీపీ పార్టీనే.. ఈసారి ఏపీ ఎలక్షన్స్ లో టీడీపీకి బీజేపీ సపోర్ట్ ఇచ్చే ఆలోచన ఉందని తెలుస్తుంది. మరి రాజకీయ కారణాలు ఏమో కానీ అమిత్ షా, ఎన్.టి.ఆర్ మీటింగ్ పట్ల ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు.

Tags: Amit Shah, Central Minister, ntr, RRR, Tollywood