అల్లు అర్జున్ స్టన్నింగ్ పిక్స్ వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాషన్ ఐకాన్. తాను చేసే ప్రతి సినిమాలోనూ తన లుక్స్‌తో డిఫరెంట్‌గా ఉండాలని ప్రయత్నించే అతికొద్ది మంది హీరోల్లో ఆయన ఒకరు. అందుకే అతన్ని స్టైలిష్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అల్లు అర్జున్ కూడా తన రాబోయే కమర్షియల్ ప్రకటనలకు స్టైలింగ్‌తో విభిన్నంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆస్ట్రల్ పైప్స్ కోసం ఓ యాడ్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ యాడ్‌లో అల్లు అర్జున్ ప్రత్యేకమైన లుక్‌లో కనిపించాలని నిర్ణయించుకున్నాడు.నిన్న, ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ సెట్స్ నుండి ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో, అల్లు అర్జున్ పోనీటైల్ మనం చూడవచ్చు.

ఈరోజు సెట్స్ నుండి మరికొన్ని ఫొటోస్ రివీల్ అయ్యాయి. ఈ ఫోటోలలో మనం అల్లు అర్జున్ చెవిపోగులు మరియు డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో కనబడుతున్నాడు ..ఈ గ్లింప్స్ చూసిన తర్వాత, యాడ్ ఫిల్మ్‌లో అల్లు అర్జున్ పూర్తి గెటప్ చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అది చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags: allu arjun, allu arjun new style look