యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాకు ఓవైపు నెగెటివ్ టాక్ ఉన్నా కూడా వసూళ్లు బాగానే వస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ మూడు రోజుల్లోనే 350 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 10 రోజుల రన్ కంప్లీట్ చేసే సరికి ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల రూపాయల గ్రాస్ సంపాదించింది. చూడడానికి ఈ నెంబర్ పెద్దగానే కనిపిస్తోంది. అయితే వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి.
శని, ఆదివారాల్లో వసూళ్లు కాస్త పెరిగాయి. అయితే ఈ సినిమా మందున్న బిగ్ టార్గెట్ నేపథ్యంలో ఈ వసూళ్లు ఏ మాత్రం సరిపోవనే చెప్పాలి. ఇప్పటికే మేకర్స్ త్రీడీ వెర్షన్ రేట్లు భారీగా తగ్గించింది. త్రీడీ వెర్షన్‌లో కూడా టిక్కెట్ రేటు కేవలం 112 రూపాయలు మాత్రమే. ఇక నార్త్‌లోనూ ఆదిపురుష్ వసూళ్లు బాగా పడిపోయాయంటున్నారు.
రీసెంట్‌గా రిలీజైన 1920 అనే హారర్ సినిమాకు అక్కడ పాజిటివ్ టాక్ రావడంతో, ఆదిపురుష్‌కు వసూళ్లు తగ్గడం కన్‌ఫార్మ్ అయినట్టే..! ఆదివారం వసూళ్లతో ఈ సినిమా హిందీ వెర్షన్ కు మొత్తంగా రు. 142 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇవి ఎక్కువగానే కనిపిస్తున్నా.. ఈ సినిమాకు నార్త్‌లో టార్గెట్ కూడా ఎక్కువగానే ఉంది.
ఇక గతంలో ప్రభాస్ నటించిన ఫ్లాప్ మూవీ సాహో సినిమా హిందీ వెర్షన్ కు 155 కోట్ల రూపాయల వసూళ్లు రావడం ఓ రికార్డ్. సాహో కూడా నార్త్ జనాలకు బాగా ఎక్కేసింది. అయితే ఆదిపురుష్‌కు నెగటివ్ టాక్ నేపథ్యంలో కనీసం సాహోనైనా ఆదిపురుష్ క్రాస్ చేస్తుందా అనే చర్చ నడుస్తోంది బాలీవుడ్ లో..! ఏదేమైనా ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ తర్వాత ఆదిపురుష్‌తోనూ బాహుబలి రేంజ్ ప్రభావం అయితే చూపలేదు.