అలనాటి నటి లయ ప్రస్తుతం తన కుటుంబంతో అమెరికాలో నివాసం ఉంటోంది. ఆమె సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్నా. ఆమె తరచుగా తన ఇన్‌స్టా ప్రొఫైల్‌లో తన డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తుంది.
ఆమె తన ఇంస్టాగ్రామ్లో కొత్త డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో, లయ ప్రముఖ గాయని మంగ్లీ (సత్యవతి రాథోడ్)తో కలిసి ఒక జానపద పాటను పాడి డాన్స్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.మంగ్లీ ఇటీవల ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొనడానికి USA వెళ్లింది.