అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటీ ఎన్టీఆర్కు జంటగా దేవర సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్ షూటింగ్ ముగించుకుని మూడో షెడ్యూల్లో కూడా అడుగుపెట్టింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసాడు కొరటాల.
ప్రస్తుతం ఈ సినిమాతో ఎలా అయినా సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయాలని జాన్వీ కపూర్ ఎంతో ఆరాటపడుతుంది. ఇదే సమయంలో జాన్వీ కపూర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు విషయం ఏంటంటే మరికొన్ని రోజుల్లోనే ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో ఉన్న ఓ స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతుందంటూ ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినిపిస్తుంది.
టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ఈ వార్త ఎంతో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం ఆ టాలీవుడ్ స్టార్ హీరోకి తెలుసో లేదో కానీ చాలామంది దర్శక నిర్మాతలు జాన్వీ దగ్గరికి వస్తే ఆ స్టార్ హీరో సినిమాలో నేను చేస్తాను అంటూ ఓపెన్ గానే చెప్పేస్తుందట. అంతేకాకుండా గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా అవకాశం వస్తే ఆ హీరో తో డేటింగ్ చేయడానికి కూడా సిద్ధమంటూ చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో జోరుగా చెక్కర్లు కొడుతుంది.
జాన్వీ కపూర్ కు ఇప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఈమె తిరిగిన తిరుగుళ్లకుకు శ్రీదేవి ఉన్నట్లయితే ఎప్పుడో పెళ్లి చేసి పడేసేది. అయితే తండ్రి బోనికపూర్ మాత్రం కూతుర్లని అంతగా పట్టించుకోకపోవడంతో జాన్వీ భాయ్ ఫ్రెండ్స్ విషయంలో అంత సీరియస్గా తీసుకోకుండా ఎంజాయ్ చేస్తూ వదిలేస్తుంది.
ఇప్పుడు వరకు బాలీవుడ్లో కలిసి ఉన్న తన ప్రియుడిని వదిలేసి టాలీవుడ్ లో ఉన్న హీరో ప్రేమ కోసం ఆరాటపడుతుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు ? నిజమందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ జాన్వీ ఏ హీరోతో ప్రేమలో పడింది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.