కొన్ని రోజుల క్రితం కోలీవుడ్ నటీనటులు మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ ఒక్కటి కాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మరో కోలీవుడ్ నటి తన రిలేషన్ షిప్ స్టేటస్ ను ప్రకటించింది.
దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన హన్సిక మోత్వాని తన బాయ్‌ఫ్రెండ్, బిజినెస్ పార్ట్‌నర్ సోహెల్ కతురియాను పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. అదే విషయాన్ని ప్రకటించడానికి హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక ఫోటోల ను పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.వారి వివాహం డిసెంబర్ 4, 2022న జరుగుతుంది. వేదిక మరియు ఇతర వివరాలను హన్సిక జంట ప్రకటించాల్సి ఉంది.