ఎన్నో తెలుగు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ్ హీరో ధనుష్.. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న”సర్” సినిమాతో తెలుగులో డైరెక్ట్ గా అడుగు పెడుతున్నాడు ధనుష్.రేపు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా సర్ సినిమా టీమ్ తన ప్రమోషన్‌లను ప్రారంభించింది.
ధనుష్ టేబుల్ ల్యాంప్ వెలుతురులో లైబ్రరీలో కొన్ని పుస్తకాలను సీరియస్‌గా చదువుతున్నట్లు కనిపిస్తున్నాడు.ధనుష్ ఈ లుక్‌లో డిఫరెంట్‌గా మరియు సీరియస్‌గా కనిపిస్తున్నాడు . మరి అంతే కాకుండా అతని కండ పుష్టితో కేవలం ‘సర్’ అని కాకుండా చాలా ఎక్కువ ఉందని సూచించడాన్ని కూడా మనం గమనించవచ్చు.పోస్టర్ టైటిల్ సినిమా సబ్జెక్ట్‌కు తగినట్లుగా మరియు జస్టిఫైడ్‌గా కనిపిస్తుంది.
రేపు సాయంత్రం 6 గంటలకు టీజర్ విడుదల కానుంది. ద్విభాషా చిత్రాన్ని సితార నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.