భానుమ‌తికి – అక్కినేని కాంబినేష‌న్ వెన‌క ఇంత క‌థ న‌డిచిందా…!

ఎన్టీఆర్‌తోను, అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతోనూ.. అల‌నాటి హీరోయిన్‌.. ఫైర్ బ్రాండ్ భానుమ‌తి క‌లిసి న‌టించా రు. భానుమ‌తికి ఉన్న ప్ర‌ధాన లక్ష‌ణం.. త‌న క్యారెక్ట‌ర్ హైలెట్ కావాలి. తన పాత్ర‌లో బిగింపు ఉండాలి. ముందుగానే ఆయా విష‌యాల‌పై స్ప‌ష్టత ఇవ్వాలి. వీటిలో ఏమాత్రం తేడా వ‌చ్చినా.. సినిమాను సైతం వ‌దిలేసుకునేవారు. ఇలానే సూప‌ర్ హిట్ మూవీ మిస్సమ్మ‌ను వ‌దులుకున్నార‌ట భానుమ‌తి.

Nuvvante Naakenduko Song - Antastulu Movie Songs - ANR, Krishna Kumari,  Bhanumathi - YouTube

దీంతో భానుమ‌తి న‌టించిన‌సినిమాల్లో ఆమే హైలెట్ అవుతుంద‌నే టాక్ ఉండేది. నిజానికి భానుమ‌తి న‌టించిన ఏసినిమా తీసుకున్నా.. ఆమెకు ఎక్క‌వ ఫోక‌స్ ఉంటుంది. సొంత చిత్రాలైతే (భ‌ర‌ణి పిక్చ‌ర్స్‌) ఇక‌, ఈ ప్రాధాన్యం మ‌రింత ఎక్కువ‌గా ఉండేది. దీంతో హీరోలు పెద్ద‌గా ఆమెతో న‌టించేందుకు ఇష్ట‌ప‌డేవారు కాదు. కానీ, న‌టించాల‌నే కుతూహ‌లం మాత్రం ఉండేది.

Dr Bhanumathi Ramakrishna The Lady Colossus Of Telugu Cinema

భానుమ‌తి వంటి హీరోయిన్ దొర‌క‌డ‌మే అదృష్టం గురూ అని అన్న‌గారు అంత‌టి వారు అనేవార‌ట‌. అయితే.. భానుమ‌తితో ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. ఎందుకంటే.. భానుమ‌తికి-అక్కినేనికి మాత్ర‌మే కాంబినేష‌న్ స‌రిపోయింది. ఎక్క‌డా కూడా అక్కినేని త‌న పాత్ర‌ను త‌గ్గించార‌ని.. భానుమ‌తి పాత్ర‌ను హైలెట్ చేశార‌ని వివాదానికి పోయేవారు కాదు.

Dulapara Bullodo: Bhanumathi's take on eve teasers - The Hindu

క‌థ న‌చ్చితే చాలు. ఇలానే మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలోనే విప్ర‌నారాయ‌ణ వంటి సినిమాలో అక్కినే ని న‌టించారు. వాస్త‌వానికి ఈ క‌థ‌.. ఎన్టీఆర్ న‌టించిన పాండురంగ మ‌హ‌త్యం సినిమాకు పోటీగా తీశారు. దీనిలోనూ అన్న‌గారికే అవ‌కాశం ఇవ్వాల‌ని అనుకున్నా.. ఆయ‌న‌కు క‌థ న‌చ్చ‌లేదు. దీంతో అక్కినేనిని ఓకే చేశారు. దీనిలో పూర్తిగా భానుమ‌తి డామినేష‌న్ మ‌న‌కు క‌నిపిస్తుంది. ఆత‌ర్వాత‌.. వ‌రుస‌గా అక్కినేనితోనే ఆమె సినిమాలు చేయ‌డం గ‌మ‌నార్హం.