ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టున్న స్థానమే…కానీ ఇప్పుడు టీడీపీకి ఏ మాత్రం పట్టు లేని స్థానంగా మారిపోయింది. ఇక్కడ వైసీపీ హవా స్పష్టంగా నడుస్తోంది. 1999, 2004 ఎన్నికల్లోనే ఇక్కడ టీడీపీ గెలిచింది…అంతకముందు కాంగ్రెస్ హవా నడిచింది. ఇక 2009 ఎన్నికల్లో ఎప్పుడైతే శ్రీకాంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి ఇక్కడ సీన్ మారిపోయింది.
2009లో శ్రీకాంత్ కాంగ్రెస్ నుంచి గెలిచారు..ఆ తర్వాత వైఎస్సార్ మరణంతో శ్రీకాంత్..జగన్ వెంట నడిచారు. 2012 ఉపఎన్నికలో వైసీపీ నుంచి గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా శ్రీకాంత్ గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికీ అక్కడ శ్రీకాంత్ బలంగానే ఉన్నారు. రాష్ట్రంలో నిదానంగా టిడిపి బలం పెరుగుతున్నా సరే.. రాయచోటిలో మాత్రం పుంజుకోలేకపోతుంది.
అయితే ఇక్కడ టిడిపికి బలమైన నాయకులు ఉన్నారు. టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న రమేశ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అటు వైసీపీ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీలోకి వచ్చారు. ఇటు మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు ఫ్యామిలీ ఉంది. అయితే ఆ ఫ్యామిలీ ఇప్పుడు అంత యాక్టివ్ గా ఉంటున్నట్లు కనిపించడం లేదు.
ఇక నియోజకవర్గంలో పార్టీని మొత్తం నడిపించెంది రమేశ్ రెడ్డి మాత్రమే. ఇక ఆయన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇక ఇటీవల జోన్-4 సమావేశం నిర్వహించగా,. ఆ సమావేశంలో టాప్ టెన్ లో నిలిచిన నియోజకవర్గాలని చంద్రబాబు చెప్పారు. అయితే శ్రీకాంత్ రెడ్డి జోరు ముందు రమేష్‌రెడ్డి ఇంకా కష్టపడాలి.. లేకపోతే ఇక్కడ టీడీపీ కి గెలుపు కష్టంగానే కనిపిస్తోంది.