కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ (Amala Paul) ప్రస్తుతం కెరియర్ లో ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వెళ్తుంది. కడవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అమలా పాల్. ఆ సినిమా ప్రమోషన్స్ లో అమలా పాల్ తన కెరియర్ లో ఒత్తిడికి ఫీలైన విషయాల గురించి చెప్పుకొచ్చారు. తెలుగులో కేవలం రెండు సినిమాల్లోనే నటించిన అమలా పాల్ తమిళ, కన్నడ బహషల్లో చాలా సినిమాలు చేసింది.
అయితే కెరియర్ లో స్టార్ హీరోల సరసన నటించిన అమలా పాల్ (Amala Paul) సీనియర్ హీరోలతో కూడా జోడీ కట్టింది. అయితే వారితో రొమాంటిక్ సీన్స్ కూడా చేసింది అమలా పాల్. అయితే సీనియర్ హీరోలతో రొమాంటిక్ సీన్స్ చేసేప్పుడు మాత్రం చాలా ఒత్తిడి ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది అమలా పాల్. అవకాశాలు లేక ఆ టైం లో అలా చేయాల్సి వచ్చిందని ఆ టైం లో తాను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది.
డైరక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లాడి రెండేళ్లకే డైవర్స్ తీసుకున్న అమలా పాల్ తమిళంలో అరకొర అవకాశాలతో కెరియర్ వెళ్లదీస్తుంది. గ్లామర్ షో విషయంలో కూడా నో లిమిట్స్ అంటున్న అమ్మడు సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది.