బాల‌య్య 109వ‌ సినిమా నుంచి క్రేజీ అప్డేట్… నంద‌మూరి ఫ్యాన్స్‌ను ఆప‌లేం..!

గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస క్రేజీ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అఖండ, వీర సింహారెడ్డి వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం తన 108వ సినిమా భగవంత్ కేసరి సినిమాను స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్‌ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను దసరా కనకగా అక్టోబర్ 19న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.

అలాగే ఈ సినిమాలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. మరో టాలీవుడ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీ లీల కూడా ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా ఒకీలక పాత్రలో నటిస్తుంది. అలాగే నరసింహ బాలయ్య తన 109వ సినిమాను మెగా దర్శకుడు బాబీతో ఇప్పటికే మొదలుపెట్టాడు. జూన్ నెలలో బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ గురించి ఓ తాజా అప్డేట్ బయటికి వచ్చింది.

ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను రామోజీ ఫిలిం సిటీ లో స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ముందుగా బాలయ్య పై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని షూట్ చేస్తారట. ప్రస్తుతం యాక్షన్ సీన్స్ కు సంబంధించిన సేట్‌ను రెడీ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో రెండు వారాల్లోని బాలయ్య 109వ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది అని తెలుస్తుంది.

ఇక అలాగే ఈ సినిమాలో కూడా బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని మరి ముఖ్యంగా బాలయ్య తండ్రి కొడుకుల పాత్రలో తండ్రిగా బాలయ్య గెటప్ ఓ రేంజ్ లో ఉంటుందని టాక్ ఇప్పటికే వచ్చింది. ఇక మరి దర్శకుడు బాబి బాలయ్యను ఈ సినిమాలో ఏ రేంజ్ లో చూపిస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.