సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళు నటించిన సినిమాలు రిలీజై ఏళ్లు గడిచిపోతున్నా సరే వారిలో కొంతమంది ఆర్టిస్టులను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. స్టార్ హీరోల కన్నా హ్యూజ్ రేంజ్లో తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ కిడ్స్ ఎంతోమంది ఉన్నారు. అలా నటనతో చెరగని ముద్ర వేసుకున్న చైల్డ్ ఆర్టిస్టులలో ఒకడే మహేష్ బాబు స్పైడర్ సినిమాలో నటించిన బుడ్డోడు. ఈ సినిమా మహేష్ కెరిర్ లోనే భారీ డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
స్పైడర్ సినిమాలో మహేష్ బాబు ఎంత క్రేజ్ దక్కించుకున్నా అంతకు డబల్ రేంజ్ లో పేరు సంపాదించుకున్న ఈ బాబు అందరికీ గుర్తుండే ఉంటాడు. తనదైన స్టైల్ లో ప్రేక్షకులను భయపెట్టిన ఈ కుర్రాడు పేరు సంజయ్. ఈ సినిమాలో తనకు ఇచ్చిన పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన సంజయ్ సినిమా కథనే కొత్త మలుపు తిప్పడన్న సంగతి తెలిసిందే. ఎవరైనా మరణించినప్పుడు తన కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటే ఆ ఏడుపులో అతడి ఆనందాన్ని వెతుక్కునే పాత్రలో జీవించేసాడు సంజయ్.
ఇప్పటికీ ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆ కుర్రాడు చూపులు తలుచుకుంటుంటే చాలామంది ఒళ్ళు గబుర్లు పొడుస్తుంది. అలాంటి నటన కనబరిచిన సంజయ్ తర్వాత కోలీవుడ్ లో వరుస అవకాశాలతో నటిస్తున్నాడు. ఓ పక్కన చదువుకుంటూనే మరో పక్కన సినిమాల్లో బిజీ అయన సంజయ్ చెన్నైలో పుట్టాడు. సంజయ్ కుట్టి టాకీస్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ను కూడా రన్ చేస్తున్నాడు. ఇతను పాటలు కూడా చాలా బాగా పాడతాడట, డాన్స్ కూడా ఇరగదీస్తాడట. ఇక సంజయ్ పెద్దయ్యాక హీరోగా అవ్వాలంటూ ఆశపడుతున్నారట. ఈ బుడ్డోడు కోరిక సక్సస్ అవుతుందో లేదో చూడాలి.