ఆ స్టార్ హీరోతో డేట్‌ గురించి ఓపెన్ అయిన సామజవరగమన హీరోయిన్… ఇంతకీ ఏం చెప్పిందంటే…!?

శ్రీవిష్ణు, రెబా మోనిక జంటగా నటించిన సినిమా సామజవరగమన. రామ్ అబ్బారాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబ‌ట్టింది. ఈ చిత్రాని అనిల్ సుంకర సమర్పంణలో ఏకే ఎంటర్టైన్ మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్వహించారు. జూన్ 29న చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ రెబా మోనిక. మలయాళ చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికి ఈమె తెలుగులో ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది. రెబా మాట్లాడుతూ… జెర్సీలో నానితో చేసే అవకాశం వచ్చింది. కానీ నేను ఆయనకు కూడా అభిమానే.

అల్లు అర్జున్‌కు మాత్రం నేను చాలా బిగ్ ఫ్యాన్. ఆయనకు మలయాళంలో చాలామంది ఫాన్స్ కూడా ఉన్నారంటూ… అయన‌ను అక్కడ మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఏ హీరోకి లేని క్రేజ్ అల్లు అర్జున్‌కి మాత్రమే ఉంది. అల్లు అర్జున్ మూవీస్‌కు మలయాళంలో చాలా క్రేజ్‌ ఉందంటూ తన‌కు ఇష్టమైన హీరోని తెగ పొగిడేసింది.

తెలుగులోకి రాకముందు మిమ్మల్ని ఒక స్టార్ హీరో డేట్ కు పిలిచారని ప్రశ్నించంగా రెబా మోనిక స్పందించింది.. ఆ హీరో డేట్‌కు పిలవడంపై మాట్లాడుతూ అలా జరిగింది.. డేట్‌కు పిలిచాడు.. కానీ నేను వెళ్ళానా లేదా అన్నది ముఖ్యం.. కానీ నేను వెళ్ళలేదు అంటూ చెప్పుకోచ్చింది ఈ ముద్దుగుమ్మ. డేటుకు వెళ్లడం అనేది తప్పుగా భావించాల్సిన విషయం ఏమి కాదని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో రెబా పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.