టాలీవుడ్లో ఇటీవల రిలీజైన సినిమా బ్రో ది అవుతార్. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సముద్రఖనీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జస్ట్ ఓకే టాక్ సంపాదించింది. ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులకు బాగా కనెక్ట్ అయింది. పవన్‌ని ఫాన్స్ ఏ విధంగా ? చూడాలనుకున్నారో అదే మాడ్యులేషన్లో పవన్‌ని చూపించాడు సముద్రఖని. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కూడా మరో హీరోగా నటించాడు.
మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాలో నటించిన నటీనటుల డీటెయిల్స్ గూగుల్ లో సెర్చింగ్ మొదలుపెట్టారు అభిమానులు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ రెండో చెల్లెలుగా నటించిన ఆ అమ్మాయి ఎవరు అనే విషయం ఆసక్తిగా మారింది.
ఇందులో హీరోయిన్స్‌గా నటించిన కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్స్ ఆల్రెడీ తెలిసిన వాళ్లే కావడంతో వాళ్ల గురించి పెద్దగా ఫోకస్ లేదు. కానీ సాయిధరమ్ తేజ్ రెండో చెల్లెలుగా నటించిన అమ్మాయి నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దీంతో ఈమె ఎవరు అనేదానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు మెగా ఫ్యాన్స్. ఈ క్రమంలో ఆ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిసి షాక్ అవుతున్నారు.
ఈమె ఒక తమిళ్ స్టార్ హీరోయిన్ ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలను నటించింది. పేరు యువ శ్రీలక్ష్మి. సముద్రఖని పట్టు పట్టి మరి ఈ పాత్రకు శ్రీ లక్ష్మిని చూస్ చేసుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమాలో శ్రీ లక్ష్మీ నటన చూసిన చాలామంది బడా డైరెక్టర్ తమ సినిమాల్లో ఆఫర్లు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని స్టార్ హీరోల సినిమాల్లో ఈ బ్యూటి కనిపించబోతుందట. మరి తెలుగు ప్రేక్షకులను ఈమె ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.