” బ్రో ” ఫస్ట్ ఫస్ట్ డే క‌లెక్ష‌న్ రికార్డులు బోల్తా…. భ‌లే దెబ్బ‌డిపోయిందే..!

పవన్ కళ్యాణ్, ప‌వ‌న్ మేనల్లుడు సాయి ధరంతేజ్ ఇద్దరు కాంబినేషన్లో ” బ్రో ” సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. రిలీజ్‌కి ముందే భారీ అంచనాలు ఉన్నా కూడా బ్రో మిగిలిన‌ పెద్ద హీరోల సినిమాలతో కంపేర్ చేసుకుంటే చాలా లిమిటెడ్ గా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఇదే ప‌రిస్థితి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో కూడా ఈ సినిమాకు లిమిటెడ్ షోలే ఉన్నాయి.

ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో మూడు పెద్ద హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఓపెన్ హైమర్, బార్బీ, మిషన్ ఇంపాజిబుల్ 7.. ఈ మూడు సినిమాలు బాగా నడుస్తుండడంతో మల్టీప్లెక్స్‌లలో కంటిన్యూ షోలు నడుస్తున్నాయి. మరోపక్క చిన్న సినిమాగా వచ్చిన ఆనంద్ దేవరకొండ, శ్రీ వైష్ణవి ‘ బేబీ ‘ సినిమా కూడా భారీ సక్సెస్ సాధించి ఇప్పటికీ మంచిగా రన్ అవుతూనే ఉంది. లాభాలు వచ్చే ఈ సినిమాను తీయడానికి థియేటర్స్ వాళ్ళు ఒప్పుకోలేదు.

దీంతో బ్రో మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ లో కూడా మిగతా సినిమాలతో కలిసి షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఓవర్సీస్ లోను హాలీవుడ్ సినిమాలే ఎక్కువగా ఆడుతున్నాయి. ఈ కారణంతో అక్క‌డ కూడా బ్రో సినిమా భారీగా రిలీజ్ కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ షోస్ కానీ, టికెట్ హైక్ కానీ లేకపోవడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ అంతంత మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమాకు ఇలా లిమిటెడ్ షోలు ఉండడం ఇదే మొదటిసారి.

బ్రో ఓవరాల్ బిజినెస్ రూ.100 కోట్లు దాటిందట. ఒక్క ఆంధ్ర ఏరియాలోని దాదాపు రూ.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో రూ.13 కోట్ల డీల్ జ‌రిగింది. నైజాం సహా మిగిలిన ఏరియాలన్నీ కలుపుకొని దాదాపు రూ.100 కోట్లు దాటిందట. ఒక్క రీమేక్ సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో.. అతని ఫ్యాన్ బేస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అలాంటి పవన్ సినిమాకు లిమిటెడ్ రిలీజ్ జరగడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.