గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎడుతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రకటించింది. గత గురువారం నుంచి శనివారం వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా బుధ, గురువారాలు కూడా సెలవులు మంజూరు చేశారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు రేపు కూడా సెలవు ఉండనుంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలు నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు రేపు శుక్రవారం కూడా సెలవు ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు.